తెలంగాణ

గారు అనబోయి గాడు అన్నారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 2: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని సిఎం కెసిఆర్ ఉద్దేశపూర్వకంగా కించపర్చలేదని నిజామాబాద్ ఎంపి కల్వకుంట్ల కవిత స్పష్టం చేసారు. రైతుల కష్టాలపై కేంద్రానికి స్పందన లేదన్న ఆవేదనతో సిఎం కెసిఆర్ కాస్త కటువుగా మాట్లాడిన విషయం వాస్తవమే అయినప్పటికీ ప్రధానిని కించపర్చే ఉద్దేశం లేదన్నారు. ప్రధానిని అవమానపరిస్తే దేశాన్ని అవమాన పరిచినట్టేనని, అయితే మోదీని అవమానపర్చేంతటి సంకుచిత మనస్థత్వం కెసిఆర్‌కు లేదన్నారు. రైతుల బాధల గురించి తన ప్రసంగంలో కెసిఆర్ ఆవేదన వ్యక్తం చేస్తూ, తాను ఈ విషయాన్ని మోదీ గారి దృష్టికి తీసుకెళ్లినా అనబోయి మరో మాట తప్పుగా దొర్లిందని కవిత వివరించారు. ఒక్కోసారి ప్రసంగాల్లో తప్పులు దొర్లుతుంటాయని, దావోస్‌లో ప్రధాని మోదీ ప్రసంగిస్తూ ఆరు వందల కోట్ల మంది భారతీయులు ఓట్లేసి తనను గెలిపించుకున్నారని అన్నారని కవిత గుర్తు చేసారు. సిఎం కెసిఆర్ చేసిన ఉద్వేగపూర్తి ప్రసంగంలో దొర్లిన చిన్న తప్పును పట్టుకుని బిజెపి నేతలు రాద్ధాంతం చేయడం సరికాదని కవిత హితవు పలికారు.