తెలంగాణ

గెజిటెడ్ భవన్‌లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 2: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని గెజిటెడ్ భవన్‌లో వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారు. మార్చి 6, 7 తేదీల్లో నిర్వహించనున్న వేడుకల పోస్టర్‌ను ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ ఆవిష్కరించారు. అనంతరం తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు మమత మాట్లాడుతూ ఈ వేడుకలకు నిజామాబాద్ ఎంపీ, జాగృతి అధ్యక్షురాలు కవిత, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డిలు ముఖ్య అతిధులుగా హాజరౌతున్నట్టు చెప్పారు. వేడుకల్లో పాల్గొనేందుకు మహిళా ఉద్యోగులందరికీ అవకాశం ఇవ్వాలని ఇప్పటికే ప్రభుత్వాన్ని కోరినట్టు ఆమె తెలిపారు.