తెలంగాణ

జేఏసీగా ఆవిర్భవించి బీసీ సమస్యలకై పోరాడుదాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 2: దేశంలో 50శాతానికి పైగా ఉన్న బీసీ కులాలు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ఎంతో వెనుకబాటును అనుభవిస్తున్నాయని బీసీ కుల సంఘాల విస్తృత స్థాయి సమావేశంలో నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో జేఏసీగా ఆవిర్భవించి సమస్యల సాధన కోసం పోరాడుదామని తీర్మాణించారు. తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ‘కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల బడ్జెట్‌లు-బీసీల వాట’ అనే అంశంపై సమావేశాన్ని నిర్వహించారు. జాజుల శ్రీనివాస్ గౌడ్ అధ్యక్షతన జరిగిన సమావేశానికి సుమారు 80కి పైగా బీసీ కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు. దేశానికి బీసీ ప్రధాని ఉన్న బీసీల సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదని, అన్ని రాజకీయ పార్టీలు బీసీలచే తమ జెండాలు మోయించుకుంటూ రాజకీయంగా అణిచివేస్తున్నాయని మండిపడ్డారు. ఈ నేపథ్యంలో బీసీ కులాలన్ని ఏకమై జేఏసీగా ఆవిర్భవించి ముందుకు సాగాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. మహాత్మ జ్యోతిరావు పూలే పేరుతో హైదరాబాద్‌లో 50 ఏకరాల్లో బీసీ భవన్‌ను ఏర్పాటు చేయడంతో పాటు సచివాలయం పక్కన పూలే కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. బీసీ సంక్షేమానికి 20వేల కోట్లు కేటాయించాలని ఒకోక కులానికి వంద కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు.