తెలంగాణ

ఎమ్సెట్‌లో జంబ్లింగ్-జంబ్లింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 2: తెలంగాణలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫారెస్ట్రీ అండర్ గ్రాడ్యూయేట్ కోర్సుల్లో అడ్మిషన్లకు నిర్వహించే ఎమ్సెట్‌పై గట్టి ధీమాను జెఎన్‌టియు, ఉన్నత విద్యా మండలి వ్యక్తం చేస్తున్నా విద్యార్థుల్లో మాత్రం అనుమానాలు నివృత్తి కావడం లేదు. ఈసారి ఎమ్సెట్‌తో సహా అన్ని పరీక్షలను ఆన్‌లైన్‌లో నిర్వహించబోతున్నారు. దీంతో ఒక స్లాట్‌లో సుమారు పాతిక వేల మంది మాత్రమే వివిధ ప్రాంతాల్లో పరీక్ష రాసేందుకు వీలుంటుంది. ఆన్‌లైన్ ప్రవేశపరీక్షను అగ్రికల్చర్ గ్రూప్ కోర్సులకు మే 2, 3 తేదీల్లో ఉదయం , సాయంత్రం నిర్వహిస్తారు. ఇక ఇంజనీరింగ్ స్ట్రీం కోర్సులకు మే 4, 5, 7 తేదీల్లో ఉదయం సాయంత్రం నిర్వహిస్తారు. ఈ క్రమంలో ఒక రోజు ఉదయం పరీక్ష రాసే సుమారు 25 వేల మందికి ఒక ప్రశ్నాపత్రం, సాయంత్రం మరో ప్రశ్నాపత్రం వస్తుంది. అంటే వ్యవసాయ కోర్సులకు, ఇంజనీరింగ్ కోర్సులకు కలిపి ఐదు రోజులు అంటే పది ప్రశ్నాపత్రాలు రూపొందించాలి.
ఈపది ప్రశ్నాపత్రాలను మరో మారు జంబ్లింగ్ చేసి నాలుగు సెట్ల కింద రూపొందించాలి. అంటే మొత్తం 40 ప్రశ్నాపత్రాలు రూపొందుతాయి. ఇప్పటికే 19 సార్లు ఎమ్సెట్‌ను నిర్వహించిన ఘనకీర్తి జెఎన్‌టియుకు ఉన్నా ప్రశ్నాపత్రాల్లో అచ్చుతప్పులు, ప్రశ్నతప్పులను నిర్మూలించకపోయింది. మరో పక్క ఎమ్సెట్ లీక్ బాధ విద్యార్థులను వెంటాడుతునే ఉంది. వీటన్నింటికీ మించి ఇటీవల తెలంగాణ పబ్లిక్ సర్వీసు కమిషన్ ఆన్‌లైన్ నిర్వహణలో విఫలం కావడంతో పాటు మెరిట్ జాబితాను రూపొందించడంలోనూ సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ పొరపాట్లుతో అభ్యర్ధుల్లో ఆందోళన పోలేదు. పరీక్ష రాస్తున్నపుడు సెర్వర్ల సమస్య, లేదా ప్రశ్నాపత్రాల జంబ్లింగ్‌లో ఇబ్బందులు ఎలా ఉంటాయోనని అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈసారి ఐదు రోజులకు 10 ప్రశ్నాపత్రాలను రూపొందించినపుడు అగ్రికల్చర్ స్ట్రీంలో నాలుగు ప్రశ్నాపత్రాలు , ఇంజనీరింగ్ స్ట్రీంలో ఆరు ప్రశ్నాపత్రాలను నార్మలైజేషన్ చేస్తామని నిర్వాహక కమిటీ చెబుతోంది. ఇందుకు గేట్, ఐఐటి, బిట్స్ పిలానీ వంటి సంస్థలు అనుసరించే పద్ధతిని తాము కూడా అనుసరిస్తామని ఎమ్సెట్ కమిటీ పేర్కొంటోంది. అయితే శాస్ర్తియమైన నార్మలైజేషన్ ప్రక్రియను సక్రమంగా నిర్వహించకుంటే తమకు నష్టం వస్తుందని విద్యార్థులు వాపోతున్నారు. నార్మలైజేషన్ వల్ల కాఠిన్యత స్థాయి వల్ల సమాధానం రాయలేకపోయిన వారు, అదే విధంగా పొరపాట్లు దొర్లడం వల్ల సమాధానాలు రాయలేకపోయిన వారు ప్రయోజనం పొందుతారని, మిగిలిన తెలివైన విద్యార్ధులకు మాత్రం ప్రశ్నాపత్రంలోని లోపాలు శాపంగానే మారుతాయని అంటున్నారు. ఆన్‌లైన్ పరీక్ష నిర్వహణ, నార్మలైజేషన్ నిప్పుతో చెలగాటంలా ఉందని విద్యావేత్త, జూనియర్ ప్రైవేటు కాలేజీల యాజమాన్య సంఘం జాతీయ నాయకుడు లకినేని ప్రసాద్ ఆరోపించారు.