తెలంగాణ

ప్రతీ ఎకరాకు నీరు అందించడమే లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కమాన్‌పూర్, మార్చి 2: తెలంగాణ రాష్ట్రంలోని ప్రతీ ఎకరాకు సాగునీరు అందించడమే టి ఆర్ ఎస్ ప్రభుత్వ లక్ష్యమని పుట్ట మధు అన్నారు. ఎస్ ఆర్ ఎస్‌పి డి-83 రంగపురం వద్ద కాలువకు సుందిల్ల ఎత్తిపోతల ప్రాజెక్ట్ పైప్‌లైన్‌ను అనుసంధానం చేసి కమాన్‌పూర్ మండలంలోని చెరువులు, కుంటలు నింపే ప్రక్రియలో భాగంగా శుక్రవారం కాళేశ్వరం ప్రాజెక్ట్ చీఫ్ సూపరింటెండెంట్ నల్లా వెంకటేశ్వర్లుతో కాలువ పాయింట్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మధు మాట్లాడుతూ రైతుల విన్నపాల మేరకు ముఖ్యమంత్రి కెసి ఆర్‌కు, భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావుకు ఇక్కడి పరిస్థితిని వివరించడం జరిగిందని, ఈ మేరకు వారు స్పందించి డి-83 కాలువ ద్వారా సాగునీరు అందించే ప్రక్రియ పరిశీలన చేయాలని అధికారులను ఆదేశించారు.
వారి ఆదేశాల మేరకు కాలువను పరిశీలించి పనులను శరవేగంగా జరిగేలా పూర్తి చేస్తామని అన్నారు. అలాగే ఈ సందర్భంగా సిఇ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ సుందిల్ల ఎత్తిపోతల ప్రాజెక్ట్ ద్వారా సాగునీరు అందించేందుకు పరిశీలన చేయడం జరిగిందని, ఈ నివేదికను ప్రభుత్వానికి అందజేయడం జరుగుతుందని పేర్కొన్నారు. వారి వెంట టి ఆర్ ఎస్ పార్టీ నాయకులు ఉన్నారు.