తెలంగాణ

మూసీ ప్రక్షాళనపై బీజేపీ నజర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వలిగొండ, మార్చి 2: ఒకనాడు స్వచ్ఛమైన తాగునీటితో నాలుగు జిల్లాల గుండా గలగల పారే మూచుకుందా (మూసీ) నది నేడు పారిశ్రామిక వ్యర్థాలతో మూసీ మురికికూపంగా మారి జాతీయ స్థాయిలో అత్యంత కాలుష్యం ఉన్న నదిగా మూసీ నది నాలుగో స్థానానికి చేరుకుంది. దీనితో త్రాగునీటి మూసీ కనీసం పంట పొలాలకు ఉపయోగించుకునేందుకై వీలులేని విధంగా మూసీ నీరు విషతుల్యమైంది. పారిశ్రామికీకరణతో ఏర్పాటవుతున్న పరిశ్రమలు వదులుతున్న వ్యర్థ రసాయనాలు మూసీలో రోజురోజుకు పెరిగి మూసీ మరింత కాలుష్య కాసారంగా మారింది. దీనితో మూసీపై ఆధారపడి జీవించే పశువులకు, జీవాలకు గర్భస్రావాలు జరగడం, నీటిని తాగి అనారోగ్యానికి గురైతున్న కొన్ని జాతుల పక్షులు అంతరించే పరిస్థితి ఏర్పడింది. అంతేకాకుండా మూసీ నీటితో పండించిన పంటల్లో రసాయనాలు కలిసిపోవడంతో పంటలు నాణ్యతగా లేక వాటిని తిన్నవారికి నాడివ్యవస్థపై రసాయనాల ప్రభావం చూపి అనారోగ్యబారిన పడడం జరుగుతుంది. మూసీపై ఆధారపడి జీవించే మత్స్యకార్మికులు చెరువుల్లో చేపలు పెంచుతుండగా మూసీ రసాయన జలాల కారణంగా లక్షలాది చేపల మృతికి కారణమవుతునే ఉంది. మూసీ నది ఇదే విధంగా ఉంటే రాబోయే రోజుల్లో నీటిని వినియోగించునే పరిస్థితి లేకుండా పోతుందని బిజెపి జిల్లా అధ్యక్షుడు పీవీ శ్యాంసుందర్‌రావు గత సంవత్సరం మూసీపై పంచాయతీ కార్యక్రమం ద్వారా మూసీ ప్రక్షాళనకై నడుం బిగించి రైతులను, ప్రజలను చైతన్యపరిచారు. అందులో భాగంగానే మరోసారి పెద్దఏత్తున మూసీ ప్రక్షాళనకై పీవీ శ్యాంసుందర్‌రావు ఈనెల 6న పోచంపల్లి మండలంలో ప్రారంభించే పాదయాత్రను నాలుగు మండలాల పరిధిలో కొనసాగించేందుకై సిద్ధమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం మూసీ సుందరీకరణకై పెద్దఎత్తున నిధులను ఖర్చు చేసేందుకై ప్రయత్నిస్తుండగా బీజెపీ మూసీ సుందరీకరణ కాదు మూసీ శుద్దీకరణ కావాలనే నినాదంతో మూసీ బాట పట్టనుంది. మూసీ ప్రక్షాళన పాదయాత్ర విజయవంతంకై ఇప్పటికే మేథావుల సమావేశాలను, అభిప్రాయాలను సేకరించి మూసీ ప్రక్షాళన జరిగే వరకు ఉద్యమించేందుకై పార్టీ శ్రేణులను సిద్దం చేయడం జరిగింది. మూసీ పాదయాత్రతో ప్రభుత్వంలో చలనం వచ్చి మూసీ శుద్దీకరణకై చర్య లు చేపట్టాలని మూసీ పరివాహక ప్రాంత రైతులు కోరుతున్నారు.

చిత్రం..ఆసఫ్‌నహార్ ప్రాజెక్టు వద్ద రంగుమారిన ప్రవహిస్తున్న మూసీ