తెలంగాణ

సాగర్‌లో ఫిష్ టూరిజం ఏర్పాటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగార్జునసాగర్, మార్చి 2: నాగార్జునసాగర్‌లో మత్య్స కార్మికుల సంక్షేమం, అభివృద్ధి కోసం ఫిష్ టూరిజం(మీన యానం)ను త్వరలో ఏర్పాటుచేయనున్నట్లు జిల్లా కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ తెలిపారు. శుక్రవారం నాగార్జున సాగర్ జలాశయంలో మత్య్స శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కేజీ కల్చర్ చేపల పెంప కం కేంద్రాన్ని సందర్శించారు. గత 8 నెలల నుండి సాగర్ జలాశయంలో మత్య్స శాఖ ఆధ్వర్యంలో సంగాసియాస్ చేపలను 50కేజీలలో పెంచుతున్నారు. గతంలో మత్య్స శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, మత్య్స శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్‌కుమార్ సుల్తానియా సందర్శించి వెళ్లారు. వారి సూచనల మేరకు పర్యాటక కేంద్రమైన నాగార్జున సాగర్‌లో మత్య్సకారుల జీవనాభివృద్ధి, సంక్షేమానికి చేపలతో మిళితమైన టూరిజాన్ని అభివృద్ధి చేయాలనే ఆలోచనతో సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని జిల్లా కలెక్టర్‌కు సూచించగా శుక్రవారం వాటి ఏర్పాట్లపై జిల్లా మత్య్స శాఖ అధికారి చరితారెడ్డితో కలిసి ఆయన సందర్శించారు. దీనిలో భాగంగా నాగార్జున సాగర్ పొట్టిచెల్మ ప్రాంతం నుండి మరపడవలో సుమారు 4కిలోమీటర్లు జలాశయం మధ్యలో ఉన్న కేజీ కల్చర్ చేపల పెంపకం కేంద్రానికి వెళ్లారు. అక్కడ చేపల పెంపకం విధానాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మత్య్సకారులతో వారి సమస్యలపై చర్చించారు. మహిళా మత్య్సకారులకు కావాల్సిన రుణాలు అందజేస్తామని, వారు ఏర్పాటుచేసిన చేపల పచ్చడిలాంటి ఆహార పదార్థాలను అమ్మకం విషయమై మహిళలతో ఆయన మాట్లాడారు. అక్కడ ఏర్పాటుచేసిన సమావేశంలో ఫిష్ టూరిజం ఏర్పాటు బ్రోచర్‌ను ఆయన ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ త్వరలోనే మత్య్స శాఖ ఆధ్వర్యంలో ఒక బోటును ఏర్పాటుచేస్తున్నామని, సాగర్ సందర్శనకు వచ్చే వారు ఆ బోటులో కేజీ కల్చర్ చేపల పెంపకం కేంద్రానికి చేరుకొని ఆహ్లాదకర వాతావరణంలో గడిపే విధంగా ఏర్పాట్లు కల్పిస్తామన్నారు. అక్కడ మత్య్సకారులు ఏర్పాటుచేసిన చేపల పులుసుతో కూడిన భోజనాన్ని సందర్శనకు వచ్చిన వారికి ఏర్పాటుచేస్తామని, చేపలవేటలో పాల్గొనే వారికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేస్తూ..దానికి తగిన రుసుంను తీసుకునే విధంగా చర్యలు తీసుకోనున్నట్టు కలెక్టర్ తెలిపారు. దీనికి కేజీ కల్చర్ చేపల పెంపకం కేంద్రానికి దగ్గరలో ప్రధాన రహదారి నుండి వాహనాలు వచ్చే విధంగా రోడ్లు ఏర్పాటుచేసేందుకు అటవీ శాఖ అధికారులతో చర్చిస్తామన్నారు. సాగర్ సందర్శనకు వచ్చే వారికి ఫిష్ టూరిజం మరో అద్భుతమైన ఆహ్లాదాన్ని ఇచ్చేవిధంగా అన్ని ఏర్పాట్లు చేస్తామన్నారు. ఆయనతో పాటు జిల్లా మత్య్స శాఖ అధికారి చరితారెడ్డి, ఎఫ్‌డీవో అంజయ్య, ఇన్‌చార్జి తహశీల్దార్ నాగార్జున్‌రెడ్డి, డీపీ ఆర్‌వో నాగార్జున, డీటీసీయస్ శరత్‌చంద్ర, మత్య్స కార్మిక సంఘం అధ్యక్షులు అప్పారావు తదితరులున్నారు.
చిత్రం..ఫిష్ టూరిజం బ్రోచర్‌ను ఆవిష్కరిస్తున్న కలెక్టర్ గౌరవ్ ఉప్పల్