తెలంగాణ

రైతులకు మీరేం చేశారు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 3: ముఖ్యమంత్రి అసభ్యంగా, అవమానపరిచే విధంగా, అవహేళన చేసే విధంగా మాట్లాడటాన్ని యావత్తు తెలంగాణ ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని బిజెపి శాసనసభాపక్ష నేత జి కిషన్‌రెడ్డి అన్నారు. ప్రధానమంత్రిని ఉద్ధేశించి అసభ్యంగా మాట్లాడటమే బంగారు తెలంగాణ అవుతుందా అని నిలదీశారు. ఎంతో హుందాగా మాట్లాడాల్సిన ముఖ్యమంత్రి చాలా హీనంగా మాట్లాడారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి మాటలను ఆమె కుమార్తె, కుమారుడు తక్కువ చేసి ఏదో నోరు జారారన్నట్టు చెబుతున్నారని కాని ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా ముఖ్యమంత్రి మాట్లాడారని పేర్కొన్నారు.