తెలంగాణ

పనిచేయని సర్పంచ్‌లను తొలగిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగిత్యాల, మార్చి 3: రాబోవు బడ్జెట్ సమావేశంలో పంచాయతీరాజ్ చట్టంలో మార్పు లు తీసుకురాబోతున్నామని, సక్రమంగా పనిచేయని సర్పంచ్‌లను తొలగించేలా మార్పు లు ఉంటాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. రాష్ట్ర ఆర్థిక సంఘం చైర్మన్‌గా పదవీ బాధ్యతలు చేపట్టి మొట్టమొదటిసారిగా జగిత్యాలకు రాగా, పౌర సన్మానాన్ని ఘనంగా ఏర్పాటు చేశారు. ఈసన్మాన కార్యక్రమంలో నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవితతో కలిసి పాల్గొన్న ఈ సమావేశంలో పోచారం మాట్లాడుతూ ప్రభుత్వాలు ఎన్ని నిధులు ఇచ్చినా స్థానిక సంస్థల పరిధిలో సక్రమంగా పని చేయకపోతే నిధులు వృథా అయి గ్రామాల అభివృద్ధి కుంటుపడుతోందని, అయితే గ్రామ పంచాయతీ బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేసిందని, దాంతో స్థానిక సంస్థలకు నిధులు సమకూర్చుతున్నట్టు తెలిపారు. ఈ నిధులు సక్రమంగా వినియోగించేందుకు పంచాయతీరాజ్ చట్టంలో మార్పులు తీసుకురానున్నట్టు మంత్రి వెల్లడించారు.