తెలంగాణ

కేసీఆర్‌ది అవకాశవాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 3: ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు అవకాశవాది అని ఎఐసిసి నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి ఎస్. జైపాల్ రెడ్డి విమర్శించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సిద్ధాంతపరంగా బిజెపి పట్ల రహాస్య ఒప్పందం ఉందని ఆయన శనివారం విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ దుయ్యబట్టారు. 2014 ఎన్నికల్లో బిజెపితో కలిసి పోటీ చేయాలని అడ్జస్ట్ కావాలని దాదాపు బతిమిలాడారని ఆయన తెలిపారు. అయితే ఆ సమయంలో బిజెపి-టిడిపిలు టిఆర్‌ఎస్ ప్రతిపాదనను తిరస్కరించాయని ఆయన చెప్పారు. ప్రగతిశీల శక్తులు, అల్ప సంఖ్యాక వర్గాలను మోసం చేసేందుకు కేసీఆర్ బిజెపికి వ్యతిరేకంగా మాట్లాడారని ఆయన తెలిపారు. ఇది లాలూచీతో చేసిన వ్యాఖ్యలేనని అన్నారు. కేసీఆర్‌కు సిద్ధాంతపరంగా బిజెపి పట్ల రహాస్య ఒప్పందం ఉందని ఆయన విమర్శించారు. ఎన్నికల ముందు టిఆర్‌ఎస్ బిజెపితో విడిపోయినా, ఎన్నికల తర్వాత బిజెపితో కలుస్తుందన్న అనుమానాన్ని ఆయన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాని నరేంద్ర మోదీనే కాదు తమ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని ఏకవచనంతో మాట్లాడారని జైపాల్ రెడ్డి తెలిపారు. కేంద్రం నుంచి కేసీఆర్ ఏమైనా నిధులు తేగలిగారా? అని ఆయన ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో తాను మహబూబ్‌నగర్ లోక్‌సభకు పోటీ చేస్తానని ఆయన తెలిపారు. పార్టీ అంతర్గత వ్యవహారాలపై బయట మాట్లాడే అలవాటు తనకు లేదని ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా అన్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా తమ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుందని ఆయన ధీమాగా చెప్పారు.