తెలంగాణ

కేటీఆర్ కళ్ళు నెత్తికెక్కాయి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 3: తెలంగాణ సొమ్ము తిన్న రాష్ట్ర ఐటి, మున్సిపల్ వ్యవహారాల శాఖ మంత్రి కే. తారక రామారావు కళ్ళు నెత్తికి ఎక్కాయని టి.పిసిసి అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్‌కుమార్ రెడ్డి విమర్శించారు. శాప్ మాజీ చైర్మన్ రాజ్ ఠాకూర్‌తో పాటు నిజామాబాద్, గ్రేటర్ హైదరాబాద్‌లోని పలువురు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు శనివారం ఉత్తమ్‌కుమార్ రెడ్డి అధ్యక్షతన కాంగ్రెస్‌లో చేరారు. ఈ సందర్భం గా ఉత్తమ్‌కుమార్ ప్రసంగిస్తూ పార్టీలో తేరుతున్న ప్రతి ఒక్కరికీ ప్రాధాన్యత ఉంటుందన్నారు. హైదరాబాద్‌లో ఉన్న సెటిలర్స్ తమతో కలిసి రావాలని, వారికి అన్ని విధా లా అండగా ఉంటామని ఆయన తెలిపారు.
కాగా సెటిలర్లను ఎన్నికలను ముందు టిఆర్‌ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి ఎన్నో విధాలుగా భయభ్రాంతులకు గురి చేశారని ఆయన తెలిపారు. తాము చేపట్టిన ప్రజాచైతన్య బస్సు యాత్రకు ప్రజల నుంచి లభిస్తున్న స్పందన చూసి టిఆర్‌ఎస్‌కు గుబులు పుడుతోందని అన్నారు.