తెలంగాణ

త్వరలోనే పట్టాదారు పాస్‌పుస్తకాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 3: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు పట్టాదారు పుస్తకాల పంపిణీ కార్యక్రమంపై వస్తున్న భిన్న కథనాలను భూపరిపాలనా శాఖ డైరెక్టర్ వీ.కరుణ ఖండించారు. పద్ధతి ప్రకారం భూప్రక్షాళన కార్యక్రమంలో భాగంగా అన్ని కార్యక్రమాలు సజావుగా జరుగుతున్నాయని చెప్పారు. 72.11లక్షల ఖాతాదారులకు 53.34లక్షల ఖాతాలకు సంబంధించి ఆదార్ ఫీడింగ్ ప్రక్రియ పూర్తి చేసినట్లు తెలిపారు. పట్టాదారు పాస్‌పుస్తకాల తయారీపై టెండర్ ప్రక్రియ కొనసాగుతుందని, టెండర్ గడువును బ్యాంక్ సెలవు నేపథ్యంలో బిడ్డర్‌ల విజ్ఞప్తి మేరకు ఈనెల 5వ తేదీ వరకు పొడిగించామని పేర్కొన్నారు. పట్టాదారు పాస్‌పుస్తకాల ముద్రణకు చాలా మంది ముందుకు వస్తున్నారని చెప్పారు. పట్టాదారు పాస్‌పుస్తకాల పంపిణీపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయనే దానిపై స్పందిస్తూ సుమారుగా రాష్ట్రంలో 2.50 లక్షల ఎకరాల అసైన్డ్ భూములు ఇతరుల చేతుల్లో ఉన్నాయని, 1.50 లక్షల ఎకరాలు శివాని జమిందార్ భూములు ఉన్నాయని తెలిపారు. మ్యూటేషన్ కోసం దరఖాస్తు చేస్తున్న సాదాబైనామా కార్యక్రమంతో సుమారు 2.50 లక్షల ఎకరాల భూములకు సంబంధించి హక్కు మార్పిడి చేసే కార్యక్రమంపై నిర్ణయం తీసుకోవాల్సి ఉందని స్పష్టం చేశారు. భూస్వాముల చేతుల్లో ఉన్న అసైన్డ్ భూములను పీఓటీ చట్టం ద్వారా స్వాధీనం చేసుకునేందుకు చర్యలు తీసుకోవాలని ఇప్పటికే అధికారులకు ఆదేశాలు ఇచ్చామని, నిరుపేదలైన రైతుల చేతుల్లో ఉన్న అసైన్డ్ భూముల జోలికీ వెళ్లడం లేదని స్పష్టం చేశారు.
వ్యవసాయేతర భూములకు సంబంధించి రైతు పాస్‌పుస్తకాలు ఇవ్వడం లేదని, పాక్షికంగా వ్యవసాయేతర భూములునే రైతులకు సంబంధించిన భూముల వివరాలను పట్టాదారు పాస్‌పుస్తకంలో వివరాలను పొందుపరిచి పంపిణీ చేస్తామని తెలిపారు. ఎన్‌ఆర్‌ఐలకు సంబంధించిన వ్యవసాయ భూమికి ఆదార్ కార్డు లేకున్నా పట్టాదారు పాస్‌పుస్తకాలు పంపిణీ చేసేందుకు కసరత్తు చేస్తున్నామని వివరించారు. ధరణి వెబ్‌సైట్‌లో సమగ్ర వివరాలను పొందుపరిచేందుకు పనులు మొదలుపెట్టినట్లు తెలిపారు.