తెలంగాణ

పౌరసరఫరాల శాఖ దేశానికే ఆదర్శం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 3: సాంకేతికతను సమర్థవంతంగా వినియోగించుకుంటూ అక్రమాలకు అరికడుతున్న తెలంగాణ పౌరసరఫరాల శాఖ దేశానికి ఆదర్శమని కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ కార్యదర్శి రవికాంత్ అన్నారు. రెండు రోజుల రాష్ట్ర పర్యటనకు వచ్చిన ఆయన ఎఫ్‌సీఐ సౌత్ రీజనల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆర్‌డీ నజీమ్, తెలంగాణ మేనేజర్ జీఎస్ రాజశేఖర్‌తో కలిసి పౌరసరఫరాల భవన్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ పనితీరును పరిశీలించారు. రేషన్ సరుకులు తరలించే వాహనాల కదలికలను, రాష్టవ్య్రాప్తంగా పౌరసరఫరాల సంస్థ గోదాముల్లో జరిగే వ్యవహరాలను సీసీ కెమెరాల ద్వారా వీక్షించారు. రాష్ట్రంలో ప్రజా పంపిణీ వ్యవస్థలో ప్రభుత్వం చేపట్టిన వివిధ సంస్కరణలపై కమిషనర్ సీవీ. ఆనంద్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వారికి వివరించారు. అనంతరం క్షేత్రస్థాయిలో పర్యటించిన రవికాంత్ బృందం సీసీ కెమెరాల పనితీరు, రేషన్ బియ్యం నాణ్యత, ఈపాస్ విధానం అమలు తీరును పరిశీలించారు.
తెలంగాణ రాష్ట్రం సాంకేతికతకు పెద్దపీట వేస్తుందని, రాష్ట్రంలో ధాన్యం సేకరణ విధానం బాగుందని, ముఖ్యంగా మధ్యవర్తుల ప్రమేయం లేకుండా రైతుల నుంచి సేకరించిన ధాన్యానికి ఆన్‌లైన్ ద్వారా నేరుగా రైతుల ఖాతాల్లోకి జమ చేసే విధానాన్ని ప్రశంసించారు.