తెలంగాణ

కందుల కొనుగోళ్లపై మంత్రి హరీష్ రావు సమీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 3: రాష్ట్రంలో ఇప్పటి వరకు 24 లక్షల క్వింటాళ్ల కందులను రూ.1315 కోట్లతో కొనుగోలు చేసినట్టు మార్కెటింగ్ శాఖ మంత్రి హరీష్‌రావు పేర్కొన్నారు. శనివారం సెక్రెటరియేట్‌లో కందుల కొనుగోళ్లపై సంబందింత శాఖల అధికారులతో ఆయన సమీక్షా-సమావేశం నిర్వహించారు. కందుల కొనుగోళ్ల వ్యవహారంలో కేం ద్రం ఉదాసినంగా వ్యవహరిస్తుందని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ విషయంపై కేంద్రానికి పలుమార్లు లేఖలు రాసినా ప్రయోజనం లేకుండా పోయిందని అన్నారు. ఈ సారి 2.51 లక్షల హెక్టార్లలో రైతులు కంది పంట వేశారని, దీని ద్వారా 1.75 లక్షల మెట్రిక్ టన్నుల కంది సాగు అయిందని చెప్పారు. ఇందులో కేవలం 75 మెట్రిక్ టన్నులను మాత్రమే సేకరిస్తామని కేంద్రం పరిమితి విధించడం రైతులకు ఇబ్బంది కలిగించడమేనని అన్నారు. రైతుల కోసం రూ.600 కోట్ల బ్యాంక్ గ్యారం టీ ఇస్తున్నందున కందిరైతుల బకాయిలను వెంటనే చెల్లించాలని మార్క్‌ఫెడ్, హాకా సంస్థలను మంత్రి ఆదేశించారు. ఖరీఫ్ పంట పూర్తి అయ్యేలోగా మరో 145 గోడాన్లను సిద్దం చేయాలని, గోడాన్ల నిర్మాణానికి భూసేకరణ పూర్తి కాని చోట ప్రత్యామ్నాయ స్థలాలను ఎంపిక చేయాలని సూచించారు. కోల్డ్ స్టోరేజీల ఏర్పాటుపై ప్రత్యేక అధ్యాయనం నిర్వహించడంతో పాటు ఏ ప్రాంతంలో ఎక్కువగా ఏ పంట పండిస్తున్నారు, మార్కెటింగ్ డైరెక్టర్ లక్ష్మీబాయి, లక్ష్మణుడు, మార్కెటింగ్ ఎస్‌ఇ ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు.