తెలంగాణ

గ్రామ పంచాయతీ చట్టంలో త్వరలో మార్పులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, మార్చి 3: గ్రామ పంచాయతీ చట్టాల్లో రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో కొత్త మార్పులు రాబోతున్నాయని ఇప్పటికే ఆ ప్రక్రియ ఓ దశకు చేరుకుందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖమంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. శనివారం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని వైట్‌హౌస్ ఫంక్షహాల్‌లో సర్పంచుల ప్రాంతీ య సమ్మేళనం రాష్ట్ర పంచాయతీ రాజ్‌శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సమ్మేళనానికి మంత్రులు జూపల్లి కృష్ణారావు, మహేందర్‌రెడ్డి, టీఆర్‌ఎస్ లోక్‌సభా పక్షనేత జితేందర్‌రెడ్డితో పాటు పలువురు ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఈ సమ్మేళనానికి మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, జోగుళాంబ గద్వాల, వనపర్తి, రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్, నల్లగొండ, సూర్యపేట జిల్లాలకు చెందిన వేలాది మంది సర్పంచులు తరలివచ్చారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ సర్పంచులు ఎవరూ కూడా నిరాశ, నిస్పృహలకు గురికావద్దని తమ పదవీ కాలం ఆరునెలలు మాత్రమే ఉందనే ఆలోచన వదులుకోవాలని సూచించారు. కొత్త చట్టంలో మరో ఆలోచనతో కూడిన అంశాలను పొందుపర్చే అవకాశం ఉందని ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్లనే ఆయా గ్రామపంచాయతీలలో అమలు అయ్యేవిధంగా చర్చిస్తున్నట్టు చెప్పారు. దీనిపై ఇంకా ఒక నిర్ణయం తీసుకోలేదన్నారు. సర్పంచు ఎన్నికలను అనుకున్న సమయానికే నిర్వహించాలని ఉందని పరిస్థితులు ఎలా ఉంటాయోఅన్న విషయాన్ని తాను చెప్పలేనని కొత్త చట్టం తెస్తున్నందున సర్పంచులు ఉన్న పదవీకాలాన్ని సద్వినియోగం చేసుకుని ప్రజల మన్ననలు పొందేవిధంగా పనిచేయాలన్నారు. రాష్ట్ర బడ్జెట్‌లో నేరుగా గ్రామపంచాయతీలకు నిధులు వచ్చేలా ముఖ్యమంత్రి కేసీఆర్ కొత్త చట్టంలో పొందుపర్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలిపారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా గ్రామపంచాయతీ వ్యవస్థను పటిష్టపర్చడానికే కొత్త చట్టాన్ని తేబోతున్నామని మంత్రి జూపల్లి తలిపారు. ఎగ్జిక్యూటివ్ అధికారాన్ని కూడా పంచాయతీ పాలకవర్గానికే అప్పజెప్పే విధంగా ఆలోచన చేస్తున్నామని వారి జీతభత్యాలు కూడా గ్రామపంచాయతీ ద్వారానే వచ్చేలా నిర్ణయిస్తున్నామన్నారు.