తెలంగాణ

మెడికల్ హబ్‌గా తెలంగాణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 3: తెలంగాణ రాష్ట్రం వైద్య రంగంలో అత్యంత ఆధునిక సదుపాయాలకు హబ్‌గా మారిందని, దేశ, విదేశాల నుంచి హైదరాబాద్‌కు వైద్య చికిత్సకు వస్తున్నారని రాష్ట్ర ఐటి శాఖ మంత్రి కెటి రామారావు అన్నారు. శనివారం ఇక్డ అంతర్జాతీయ మెడికల్ డయాగ్నిస్టిక్స్ కంపెనీ డయాబెటోమిక్స్‌ను ఆయనన ప్రారంభించారు. ఈ నూతన సదుపాయాలతో చక్కెర వ్యాధి పర్యవేక్షణ కోసం నాన్ ఇన్వాసిస్ పాయింట్ ఆఫ్ కేర్ రోగ నిర్ధారణ పరీక్షలకు అవసరమైన సామాగ్రిని తయారు చేస్తారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ హైదరాబాద్‌లో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన డయాగ్నిస్టిక్స్ సంస్థను ఏర్పాటు చేయడాన్ని స్వాగతించారు. ఈ సందర్భంగా డయాబెటోమిక్స్ మెడికల్ సంస్థ చైర్మన్ డాక్టర్ వరప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ మధుమేహ వ్యాధితో బాధపడుతున్న వారికి సహాయపడేందుకు అందుబాటు ధరల్లో సులభంగా వినియోగించుకునేందుకు వీలుగా విశే్లషణ పరీక్షలు అందిస్తామన్నారు.
దేశంలో 66 మిలియన్ల మంది చక్కెర వ్యాధి గ్రస్తులు ఉన్నారన్నారు. ఈ సంస్థ సిఇవో డాక్టర్ నాగళ్ల శ్రీనివాస్ మాట్లాడుతూ సంస్థలో నెలకొల్పిన ఆధునిక సదుపాయాలను వివరించారు.

చిత్రం..డయాబెటోమిక్స్‌ను ప్రారంభిస్తున్న మంత్రి కేటీఆర్