తెలంగాణ

వడగాల్పుల తీవ్రతను ఇలా ఎదుర్కొందాం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 3: ప్రస్తుత వేసవిలో ఏప్రిల్ నుంచి జూన్ వరకు వడగాడ్పుల తీవ్రత అధికంగా ఉంటుందన్న నేపథ్యంలో వివిధ శాఖల అధికారులు వడగాడ్పుల యాక్షన్ ప్లాన్‌ను అమలు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్‌కె జోషి ఆదేశించారు. శనివారం సచివాయలంలో వివిధ శాఖల ఉన్నతాధిరులతో ఆయన వడగాడ్పుపలపై సమీక్ష నిర్వహించారు. గత వేసవిలో 23 రోజులు వడగాడ్పులు వీచాయని, ఈ సారి కూడా మరిన్ని రోజులు అధికంగా వడగాడ్పులు వీచే అవకాశం ఉన్నందున ప్రజలు వడదెబ్బకు గురి కాకుండా వివిధ శాఖలు సమన్వయంతో పని చేసి ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని ఆయన సూచించారు. వడగాడ్పుల తీవ్రతపై కలర్ కోడింగ్‌తో ఎప్పటికప్పుడు సూచనలను అధికార యంత్రాంగానికి, ప్రజలకు చేరే విధంగా చూడాలన్నారు. జిల్లాల్లో ఓఆర్‌ఎస్, ఫ్లూయిడ్స్, ఐస్ ప్యాక్‌లు సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. వైద్య ఆరోగ్య శాఖ ద్వారా ఎప్పటికప్పుడు హెల్త్ అడ్వైజరీ విడుదల చేయాలన్నారు. ఆశావర్కర్లు ఎఎన్‌ఎంలు, అంగన్‌వాడీ సిబ్బందికి తగు శిక్షణ నివ్వాలన్నారు. సమాచార శాఖ ద్వారా వడగాడ్పుల తీవ్రతమై పోస్టర్లు, కరపత్రాలు, హోర్డింగ్స్, సోషల్ మీడియా, టీవీ రేడియోల ద్వారా విస్తృత ప్రచారం నిర్వహించాలని ఆదేశించారు. మహిళలు, వృద్ధులు, కార్మికులు, చిన్న పిల్లలు, వడదెబ్బకు గురికాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. వడగాడ్పుల కార్యాచరణ ప్రణాళిక అమలుపై జిల్లా కలెక్టర్లకు మార్గదర్శకాలను జారీ చేశామన్నారు. పశువులు, గొర్రెలకు మంచినీరు, పశుగ్రాసం కొరత రాకుండా చూడాలన్నారు. పశువులు, గొర్రెల కోసం ప్రత్యేకంగా షెడ్స్ నిర్మించే పనులను వేగవంతం చేయాలన్నారు. హెచ్చరికల బోర్డును ఏర్పాటు చేయాలన్నారు. ఈ సమావేశంలో వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

చిత్రం..సచివాయలంలో వివిధ శాఖల ఉన్నతాధికారులతో మాట్లాడుతున్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కె జోషి