తెలంగాణ

సమర్థవంతంగా బాధ్యతలను నిర్వర్తిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 4: ప్రభుత్వం తహశీల్దార్లకు రిజిస్ట్రేషన్ బాధ్యతలను అప్పగించడాన్ని తాము స్వాగతిస్తున్నట్టు, బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తామని తెలంగాణ తహశీల్దార్ అసోసియేషన్ పేర్కొంది. ఆదివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు లచ్చిరెడ్డి, అధ్యక్షులు గౌతమ్ మాట్లాడారు. ప్రజల సౌలభ్యం కోసం ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో భూముల క్రమ విక్రయాలు పారదర్శకంగా జరిగే అవకాశం ఉందన్నారు. మండల పరిధిలోని భూములపై పూర్తి అవగాహన కలిగిన తహశీల్దార్లే రిజిస్ట్రేషన్లు చేయడం ద్వారా ప్రభుత్వ భూములు కబ్జాకు గురికాకుండా అరికట్టడంతో పాటు అక్రమాలను నివారించవచ్చునని అన్నారు. ప్రభుత్వం ఈ నిర్ణయం ప్రకటించిన మొదట్లో కొంత మంది తహశీల్దార్లు పని ఒత్తిడి పెరుగుతుందని ఆందోళన పడ్డారని అన్నారు. దీనిపై పలుమార్లు సమావేశాలు నిర్వహించిన అనంతరం ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శిని కలిసి ఉద్యోగుల కొరత సమస్యలను వివరించామని తెలిపారు. ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించడంతో పాటు అదనపు బాధ్యతలకు పూర్తిగా సహకరిస్తామని హామీ ఇవ్వడంతో బాధ్యతలను నిర్వర్తించేందకు సిద్థం అయినట్టు చెప్పారు.