తెలంగాణ

సేద్యం బడ్జెట్ 20 వేల కోట్లపై మాటే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 4: రైతుల ఆదాయం ఏడాది లేదా రెండేళ్లలోగా రెట్టింపు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర ప్రణాళికను రూపొందిస్తోంది. రైతుల ఆదాయం 2022 వరకు రెట్టింపు చేయాలని కేంద్రం రూపొందించిన ప్రణాళికను మూడేళ్ల ముందే చేరాలని ముఖ్యమంత్రి కే. చంద్రశేఖరరావు తీవ్రంగా ఆలోచిస్తున్నారు. ఈ అంశంపై చర్చించేందుకు సోమవారం ఆయన రాష్ట్ర మంత్రులు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి, తలసాని శ్రీనివాసయాదవ్, ఈటెల రాజేందర్ తదితరులతో పాటు సంబంధిత శాఖల ఉన్నతాధికారులతో చర్చించేందుకు నిర్ణయించారు. వ్యవసాయ రంగానికి ప్రత్యేక బడ్జెట్ ప్రతిపాదించాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. వ్యవసాయ బడ్జెట్‌లో ఏ ఏ శాఖలను చేర్చాలన్న అంశంపై చర్చజరుగుతుంది.
పంటల ఉత్పత్తి పెంచడం, ఆహార భద్రతను పూర్తిగా అధిగమించడం, స్వయం సమృద్ధి సాధించడం తదితర అంశాలపై కేసీఆర్ దృష్టి కేంద్రీకరిస్తున్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారం రైతులకు పెట్టుబడి సాయం కింద ఎకరాకు నాలుగువేల రూపాయల చొప్పున ఇవ్వాలని, వానాకాలంలో ఒక సారి యాసంగి సీజన్‌కు మరోసారి ఇవ్వాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఏటా ఇందుకోసం దాదాపు 12 వేల కోట్ల రూపాయలు అవసరం అవుతాయని అంచనావేశారు. ఇలా ఉండగా, బావులకు 24 గంటల పాటు ఉచిత విద్యుత్తు ఇవ్వడం ఇప్పటికే ప్రారంభమైంది. 2017-18 సంవత్సరంలో జనవరి నుండి మార్చి వరకు ఇందుకోసం రెండువేల కోట్ల రూపాయలు అవసరం అవుతాయని, 2018-19 సంవత్సరానికి దాదాపు ఆరువేల కోట్ల రూపాయలు అవసరం అవుతాయని భావిస్తున్నారు. వ్యవసాయ రంగంలో విత్తనాల సబ్సిడీ, సేంద్రీయ సేద్యానికి ఊతం ఇవ్వడం, యాంత్రిక సేద్యాన్ని ప్రోత్సహించేందుకు రైతులు యంత్రాలను కొనుగోలు చేసేందుకు కనీసం వెయ్యికోట్ల రూపాయలు ఖర్చు చేయాలని భావిస్తున్నారు. అలాగే వ్యవసాయంతో పాటు ఉద్యాన పంటలకు డ్రిప్, స్ప్రింక్లర్ (మైక్రో ఇరిగేషన్) విధానాన్ని ప్రోత్సహించేందుకు పెద్ద ఎత్తున సబ్సిడీ ఇవ్వాలని భావిస్తున్నారు. దీని వల్ల భూగర్భజలాలను పొదుపుగా వాడేందుకు వీలవుతుందన్నది ప్రభుత్వ ఉద్దేశమని తెలుస్తోంది. మైక్రోఇరిగేషన్ కోసం 200 కోట్ల రూపాయలు అవసరం కావచ్చని అంచనావేశారు. వ్యవసాయ విశ్వవిద్యాలయం, వెటర్నరీ యూనివర్సిటీ, ఉద్యాన విశ్వవిద్యాలయంతో పాటు వ్యవసాయ విద్య, విస్తరణ కార్యక్రమాలకోసం 500 కోట్ల రూపాయలు అవసరం అవుతాయని అంచనావేశారు. పశుసంవర్థక శాఖను వ్యవసాయ బడ్జెట్‌లో కలపాలా వద్దా అన్న అంశంపై సోమవారం నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. పశుసంవర్థక శాఖ కేటాయింపులను కూడా వ్యవసాయ బడ్జెట్‌లో కలిపితే మరో మూడువేలకోట్ల రూపాయలు చేర్చాల్సి ఉంటుంది. ఏది ఏమైనా రైతులకు అన్ని రకాలుగా చేయూత ఇవ్వాలని వారి ఆదాయాన్ని గణనీయంగా పెరిగేలా చూడాలని కేసీఆర్ భావిస్తున్నారు. రైతులు విత్తనం వేసిం ది మొదలు పంటల కోత తర్వాత మార్కెట్లో అమ్మేంత వరకు అడుగడుగునా రైతులకు అండగా నిలవాలన్నదే కేసీఆర్ ధ్యేయమని తెలుస్తోంది. గత నాలుగేళ్ల నుండి కనీస మద్దతు ధర (ఎంఎస్‌పి) ఇప్పించడంలో అనేక సమస్యలు ఎదురౌతూ వస్తున్నాయి. ఈ సమస్యలను రాష్ట్ర రైతు సమన్వయ సమితికి బాధ్యతలు అప్పగించబోతున్నారు.