తెలంగాణ

ప్రతి ఎనిమిది నిమిషాలకు ఓ మహిళ క్యాన్సర్‌తో మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 4: రాష్ట్రంలో ప్రతీ ఏటా నూతనంగా రెండు వేల మంది క్యాన్సర్ భారిన పడుతుండగా, దేశవ్యాప్తంగా ఈ వ్యాధితో ప్రతీ ఎనిమిది నిమిషాలకో మహిళ మృతి చెందుతున్నట్టు క్యాన్సర్ వ్యాధిపై జరుగుతున్న సర్వేలు పేర్కొనడం ఆందోళన కలిస్తుంది. నివారించదగ్గ క్యాన్సర్‌లపై ప్రజల్లో కొరవడిన అవగాహన ఈ గణాంకాలు అద్దం పడుతున్నాయి. 35-65 సంవత్సరాల మధ్య ఉన్న ప్రతీ వెయ్యి మంది మహిళల్లో కనీసం ఒకరు రొమ్ము క్యాన్సర్ భారిన పడినప్పటికీ ఈ విషయం తెలియకుండానే ఆరోగ్యవంతమైన మహిళగానే తమను తాము భావించుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు రెండు వేల మంది గర్భాశయ క్యాన్సర్ కేసులు వ్యాధి బాగా ముదిరి, చికిత్స అందించడం కష్టంగా ఉన్న సమయంలోనే వైద్యులను ఆశ్రయిస్తున్నట్టు తెలుస్తోంది. 35 నుంచి 50 ఏళ్ల లోపువారు క్యాన్సర్ భారిన పడుతుండగా 60శాతం మంది మహిళలు రొమ్ము క్యాన్సర్‌కు గురికావడం గమనార్హం. దేశవ్యాప్తంగా కూడా క్యాన్సర్ కేసులు పెరిగిపోతున్నట్టు పాపులేషన్ బేస్డ్ క్యాన్సర్ రిజిస్ట్రీ (పీబీసిఆర్) లెక్కలు తెలుపుతున్నాయి. ప్రతీ రోజు దేశవ్యాప్తంగా నూతనంగా రెండు వేల క్యాన్సర్ కేసులు నమోదు అవుతున్నట్టు ఓ అంచనా. నూతన కేసుల్లో 1200 కేసులు క్యాన్సర్ అని తెలుసుకునే నాటికే ముదిరిపోయిన దశలో ఉంటున్నాయి.
ఈ కేసులు ఇదే తీరుగా పెరిగిపోతే ప్రస్తుతం లక్షకు 110 మందిగా ఉన్న కేసులు 2025 నాటికి లక్షకు 190 నుండి 260 వరకు పెరిగి ప్రమాముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. గర్భాశయ క్యాన్సర్ మహిళలను ఎక్కుగా వేదిస్తున్నట్టు క్యాన్సర్ అధ్యాయనాల్లో స్పష్టం అవుతుంది. ప్రతీ సంవత్సరం దేశవ్యాప్తంగా ఒక లక్ష మంది క్యాన్సర్ భారిన పడుతుండగా ప్రతీ ఎనిమిది నిమిషాలకు ఒక మహిళ క్యాన్సర్‌తో మరణిస్తుందంటే వ్యాధి తీవ్రత ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. కొన్ని రకాల క్యాన్సర్లు నివారించేందుకు వ్యాక్సిన్ (టీకా) సౌకర్యం ఉన్నప్పటికీ వాటిపై మహిళాల్లో అవగాహన లేకపోవడం కూడా ఇవి పెరిగిపోవడానికి ముఖ్య కారణంగా చెప్పుకోవచ్చు. గర్భాశయ, యోని, పెల్విక్ క్యాన్సర్లు నివారించేందుకు 9 సంవత్సరాల బాలిక నుంచి 26 సంవత్సరాల వయుస్స కలిగిన మహిళల వరకు మానవ పాపిల్లోమా వైరస్ వ్యాక్సిన్ తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. అదే విధంగా గర్భశాయ క్యాన్సర్ ప్రారంభం లోనే గుర్తించేందుకు 21 సంవత్సరాల నుంచి 65 ఏళ్ల వారు పాప్‌స్మియార్ పరీక్షను చేయించుకోవాలని సూచిస్తున్నారు. మహిళల్లో ఒక్క శాతం మంది మాత్రమే క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకుంటున్నారు. చాలా మట్టుకు క్యాన్స ర్ ముదిరిపోయిన దశలోనే ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. 40 నుంచి 45 ఏళ్ల వయస్సు కలిగిన మహిళలు ప్రతీ సంవత్సరం ఒకసారి తప్పని సరిగా మమ్మోగ్రామ్ పరీక్ష చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. క్యాన్సర్ తొలి దశలో గుర్తించిన వారిలో 95శాతం మంది రెండ వ దశలో 60శాతం మంది, మూడవ దశలో 40 శాతం మంది చివరి దశలో కేవలం 20 శాతం మంది మాత్రమే బ్రతికే అవకాశాలు ఉంటంతో మహిళలు క్యాన్సర్ పట్ల అవగాహన పెంచుకోవాలని వైద్యులు సలహా ఇస్తున్నారు.