తెలంగాణ

శూన్యం నుంచి శిఖరానికి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 4: దేశ వ్యాప్తంగా బిజెపికి లభిస్తున్న ఆదరణ చూసి ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావుకు వణుకు పుడుతున్నదని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె. లక్ష్మణ్ అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనతో విసిగిపోయిన తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని ఆయన ఆదివారం విలేఖరుల సమావేశంలో తెలిపారు. వివిధ పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలను టిఆర్‌ఎస్‌లో చేర్చుకుని, అదే బలం అనుకుంటున్నారని ఆయన విమర్శించారు. దేశ వ్యాప్తంగా బలహీనపడి, ఏ మాత్రం ఓట్లు లేని పార్టీలను కలుపుకుని తృతీయ ఫ్రంట్ ఏర్పాటు చేస్తానని కేసీఆర్ అంటున్నారని ఆయన తెలిపారు. దక్షిణాది రాష్ట్రాల్లో ఇక బిజెపి ‘పాగ’ వేయబోతున్నదని, సమీప భవిష్యత్తులో జరగనున్న కర్నాటకలోనూ తమ పార్టీ సునాయసంగా అధికారం చేపట్టనున్నదని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలోనూ త్రిపుర ఎన్నికల ఫలితాలే పునరావృతం కానున్నాయని ఆయన తెలిపారు. త్రిపురలో 43 ఎమ్మెల్యే స్థానాలుంటే అన్నింటినీ బిజెపి కైవసం చేసుకున్నదని అన్నారు. అక్కడ తమ పార్టీ శూన్యం నుంచి శిఖరానికీ ఎదిగిందని ఆయన చెప్పారు. దేశం అంతా బిజెపిమయం కాబోతున్నదని ఆయన తెలిపారు. ఇది జీర్ణించుకోలేని ముఖ్యమంత్రి కేసీఆర్ విమర్శలు చేస్తున్నారని ఆయన తెలిపారు. పైగా అసహనంతో ఉంటున్నారని అన్నారు. అందుకే కొత్తగా తృతీయ ఫ్రంట్ గురించి మాట్లాడుతున్నారని ఆయన చెప్పారు. అంతే కాకుండా తృతీయ ఫ్రంట్‌కు నాయకత్వం వహిస్తానని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. దేశవ్యాప్తంగా వీస్తున్న బిజెపి పవనాలు తెలంగాణకూ తాకడం ఖాయమని భావిస్తున్నారని అన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయడంలో ముఖ్యమంత్రి కేసీఆర్ విఫలమయ్యారని ఆయన విమర్శించారు. తృతీయ ఫ్రంట్‌కు అవకాశం లేదని, ప్రజలు ఆదరించరని డాక్టర్ లక్ష్మణ్ తెలిపారు. దేశంలోని 29 రాష్ట్రాల్లో 21 రాష్ట్రాల్లో బిజెపి అధికారంలో ఉందన్నారు. వంద ఏళ్ళకుపైగా చరిత్ర ఉన్న కాంగ్రెస్ ప్రాంతీయ పార్టీగా మారుతున్నదని ఆయన చెప్పారు. నెహ్రూ, ఇందిరా గాంధీ సమయంలో కూడా కాంగ్రెస్‌కు ఈ పరిస్థితి లేదని డాక్టర్ లక్ష్మణ్ అన్నారు.
కూట్ల రాయి తీయలేని..
ఇలాఉండగా బిజెపి మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు ఆకుల విజయ మాట్లాడుతూ కూట్ల రాయి తీయడం చేతకానోడు, ఏట్లో రాయి తీస్తానని అన్నాడట అని అన్నారు. రాష్ట్రానికి దళితున్ని ముఖ్యమంత్రి చేయలేని వ్యక్తి, దేశానికి ప్రధానిని దళితున్ని చేస్తారట అని ఆమె తెలిపారు. ముందు తెలంగాణలో రైతుల ఆత్మహత్యలను నివారించాలన్నారు. ఆ తర్వాత దేశం గురించి మాట్లాడుకోవచ్చని ఆకుల విజయ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సూచించారు.