తెలంగాణ

నల్లగొండపై కేసీఆర్ నజర్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, మార్చి 4: దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు తీసుకువచ్చేందుకు జాతీయ రాజకీయాల్లో క్రియాశీలక భూమికకు తహతహలాడుతున్న టీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ బహుళ రాజకీయ ప్రయోజనాలను ఆశిస్తూ నల్లగొండ లోక్‌సభ సీటుపై కనే్నసినట్టుగా సాగుతున్న ప్రచారం జిల్లా రాజకీయాల్లో ఆసక్తి రేపుతోంది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో బలంగా ఉన్న కాంగ్రెస్‌ను దెబ్బకొట్టి నల్లగొండ లోక్ సభ స్థానంలో ఎంపీగా గెలిస్తే ఢీల్లీ రాజకీయాల్లోకి ఎంట్రీతో పాటు లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని అసెంబ్లీ స్థానాల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థుల గెలుపుకు దోహదం చేసి రాష్ట్రంలో అధికార సాధనకు కావాల్సిన సీట్లను పెంచుకోవచ్చన్న ఒకే దెబ్బకు రెండు పిట్టలన్న లక్ష్యంతో సీఎం కేసీఆర్ ఇక్కడి నుండి పోటీకి యోచిస్తున్నట్లుగా గులాబీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. ఇప్పటికే సీఎం కేసీఆర్ నల్లగొండ లోక్ సభ స్థానంలో పోటీ విషయమై పార్టీ ముఖ్యులతో, జిల్లా టీఆర్‌ఎస్ ముఖ్య నేతలతో చర్చలు జరిపినట్లుగా జిల్లా పార్టీలో గుసగుసలు గుప్పుమన్నాయి. అంతేగాక జాతీయ స్థాయిలో కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యామ్నాయ కూటమి ఏర్పాటు దిశగా ప్రయత్నాలను ముందుకు తీసుకెళ్లాలంటే నిన్నటిదాకా తోక పార్టీలుగా చీదరించుకున్న వామపక్షాలతో కలిసి సాగేందుకు నల్లగొండ నుండి తన పోటీ సానుకూలంగా ఉంటుందని కేసీఆర్ భావిస్తున్నట్టు తెలుస్తోంది.