తెలంగాణ

ప్రతి నియోజకవర్గంలో ఆహార శుద్ధి కేంద్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 5: తెలంగాణలోని ప్రతి శాసనసభా నియోజకవర్గంలో ఒక ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. 30 జిల్లాల్లో కనీసం వంద ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేసే అంశంపై ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు సుముఖంగా ఉన్నారు. ఈ అంశాలపై సమగ్రంగా అధ్యయనం చేసి నివేదిక సమర్పించేందుకు వీలుగా మంత్రివర్గ ఉపసంఘాన్ని సిఎం ఏర్పాటు చేశారు.
వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్, మార్కెటింగ్ మంత్రి టి. హరీష్‌రావు, పరిశ్రమల మంత్రి కె. తారకరామారావు (కెటిఆర్)లు సభ్యులుగా కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ మంగళవారం సచివాలయంలో సమావేశం అవుతోంది. వ్యవసాయ అనుబంద పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేసేందుకు అనుమతులు, రాయితీలు, ప్రోత్సాహకాలు తదితర అంశాలపై మంత్రివర్గ ఉపసంఘం పరిశీలన చేస్తుంది.
రైతులు పండించిన పంటలకు మద్దతు ధర కల్పించడంతో పాటు, నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు ఆహార పరిశ్రమలు (్ఫడ్ ప్రాసెసింగ్ యూనిట్లు) ఉపయోగపడతాయని, అందువల్ల ఈ యూనిట్ల ఏర్పాటును ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. నీటిపారుదల ప్రాజెక్టులు పూర్తయితే వరితో పాటు ఇతర పంటల ఉత్పత్తులు గణనీయంగా పెరుగుతాయని, అందువల్ల ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల అవసరం ఎంతో ఉంటుందని భావిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న జిన్నింగ్ మిల్లులకు తోడుగా మరికొన్ని జిన్నింగ్ మిల్లులు ఏర్పాటు చేసే అంశంపై కూడా పరిశీలన చేస్తారు. రైస్‌మిల్లులు, కోల్డ్‌స్టోరేజీల ఏర్పాటుపై కూడా ఉపసంఘం అధ్యయనం చేస్తుంది. రైతులు తమ ఉత్పత్తులను మార్కెట్లకు తీసుకువచ్చే సమయంలో ఒక శాస్ర్తియ విధానాన్ని రూపొందించి అమలు చేయాలని నిర్ణయించారు.
ఆహారశుద్ధి రంగంలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు అనేక సంస్థలు ముందుకు వస్తున్నాయి. జహీరాబాద్‌లో 6 వేల కోట్ల రూపాయలతో సమీకృత ఆహార , వ్యవసాయ ప్రాసెసింగ్ జోన్ ఏర్పాటు చేసేందుకు దక్షిణ్ ఆగ్రోపొలిస్ సంస్థ ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వంతో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ సంస్థ జహీరాబాద్‌లోని నిమ్జ్‌లో 300 ఎకరాల్లో ప్రాసెసింగ్ పరిశ్రమను ఏర్పాటు చేస్తోంది.