తెలంగాణ

బీసీ రిజర్వేషన్ల పెంపు ప్రక్రియను వేగవంతం చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 5: బీసీ రిజర్వేషన్ల పెంపుప్రక్రియను వేగవంతం చేయాలని బీసీ కమిషన్‌కు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య విజ్ఞప్తి చేశారు. సోమవారం ఖైరతాబాద్‌లోని బీసీ కమిషన్ కార్యాలయానికి వచ్చిన కమిషన్ చైర్మన్ రాములుకు వినతి పత్రాన్ని అందజేశారు. బీసీ రిజర్వేషన్ల పెంపుకు పెద్దగా కసరత్తు చేయాల్సిన అవసరం లేదని అన్నారు. జనాబా లెక్కలు సక్రమంగా ఉన్న చోట రిజర్వేషన్లు పెంచుకోవచ్చునంటూ దేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పు ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. తెలంగాణ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ల పెంపు బాధ్యతను కమిషన్‌కు ఇచ్చి సంవత్సరం గడుస్తున్నా ఆలస్యం చేయడం వల్ల బీసీలు ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుందని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం నిర్వహించిన సమగ్ర సర్వే ద్వారా జనాబా వివరాలు ఉన్నందున దాని ఆధారంగా రిజర్వేషన్లు కల్పించే వెసులు బాటు ఉందని కమిషన్‌కు వివరించారు. నిబందనల ప్రకారం తెలంగాణలో బీసీల రిజర్వేషన్లను 25 శాతం నుంచి 52 శాతానికి పెంచాల్సి ఉందని అన్నారు. విద్య, ఉద్యోగ, పదోన్నతుల్లో సైతం రిజర్వేషన్లను సక్రమంగా అమలు అయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరారు. కొత్తగా బీసీ జాబితాలో కులాలను చేర్చ సమయంలో శాస్ర్తియంగా, హేతుబద్దంగా వ్యవహరించాలని కోరారు. రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి నిబందనలు పాటించకుండా కులాలను చేర్చడం వల్ల ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉందని కమిషన్‌కు వివరించారు.