తెలంగాణ

ఆర్టీఏలో దళారీ వ్యవస్థ పూర్తిగా రద్దవ్వాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 5: రవాణా శాఖలో అవినీతికి ఆస్కారం లేకుండా ఆన్‌లైన్ వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని ఆ శాఖ మంత్రి పి.మహేందర్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. శాఖలో దళారీ వ్యవస్థ పూర్తిగా రద్దవ్వాలని అన్నారు. సోమవారం సచివాలయంలో మంత్రి మహేందర్‌రెడ్డి రవాణా శాఖ ఆధునీకరణ, అవినీతి నివారణ, ఎన్‌ఐసీ ఆధారిత కార్యకలాపాలపై శాఖ ముఖ్య కార్యదర్శి సునీల్‌శర్మ, జెటిసి రమేష్ తదితరులతో సమీక్షించారు. ఈ సందర్భంగా రంగారెడ్డి జిల్లా బండ్లగూడ ఆర్టీఏ కార్యాలయంలో ఇటీవల పాత వాహనాల రిజిష్ట్రేషన్, ఆర్‌సిల జారీలో చోటుచేసుకున్న అవినీతిపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత జరుగుతుంటే అధికారులు ఏం చేస్తున్నారంటూ ప్రశ్నించారు. వాహనాల వయస్సు, ధరను తగ్గిస్తూ అవినీతి పాల్పడి రాష్ట్ర ఖజానాకు రూ.కోటి 20 లక్షలు నష్టం కలిగించిన నలుగురు అధికారులను సస్పెండ్ చేయాలని ఆదేశించారు. అలాగే అక్కడే విధులు నిర్వహిస్తున్న పురుషోత్తమ్‌ను రవాణా శాఖ కేంద్ర కార్యాలయానికి అటాచ్ చేయాలని ఆదేశించారు. ప్రభుత్వానికి నష్టం కలిగించిన రూ.1.20 కోట్లను తిరిగి వసూలు చేయాలని స్పష్టం చేశారు. రవాణా శాఖ సాఫ్ట్‌వేర్‌ను దుర్వినియోగం చేయకుండా బ్లాక్ చైన్ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలని చెప్పారు. రవాణా శాఖ ఆధునీకరణకు అన్ని కార్యాలయాల్లో ఆధునిక వసతులు కలిగిన కంప్యూటర్లు, ప్రింటర్లు వినియోగించాలని ఆదేశించారు.