తెలంగాణ

ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ప్రశ్నలకు ఆన్‌లైన్‌లో జవాబులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 5: శాసనసభ, శాసనమండలిలో సభ్యులు అడిగే ప్రశ్నలకు సంబంధిత శాఖల అధికారులు వెంటనే సరైన జవాబులను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్‌కె జోషి ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు ఈ నెల 12 ప్రారంభం అవుతున్న నేపథ్యంలో సంబంధిత ఉన్నతాధికారులతో సోమవారం ఆయన ప్రత్యేకంగా సమీక్షించారు. ప్రతి శాఖ నుండి ఒక సమన్వయ అధికారిని (నోడల్ అధికారి) నియమించాలని సూచించారు. నోడల్ అధికారులు లెజిస్లేచర్ సెక్రటేటరియట్‌తో ఎప్పటికప్పుడు సంప్రదిస్తుండాలని ఆదేశించారు. అలాగే లెజిస్లేచర్ వెబ్‌సైట్‌తో అనుసంధానం కలిగి ఉండాలని సూచించారు. గత సమావేశానికి సంబంధించి ప్రశ్నలు తదితర రూపాల్లో సభ్యులు అడిగిన అంశాలపై సరైన సమాధానాలను, సమాచారాన్ని తక్షణమే అప్‌లోడ్ చేయాలని సూచించారు. ఒక్క అంశం కూడా పెండింగ్‌లో లేకుండా చూడాలని ఆదేశించారు.
ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు అజయ్ మిశ్రా, చిత్రారామచంద్రన్, వివిధ శాఖల ముఖ్యకార్యదర్శులు, కార్యదర్శులు పాల్గొన్నారు.

చిత్రం..ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ప్రశ్నలకు ఆన్‌లైన్‌లో జవాబులపై నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతున్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్‌కె జోషి