తెలంగాణ

నిలదీస్తే...అణచివేస్తారా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 5: ప్రధాని నరేంద్రమోదీ పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై ప్రజాస్వామ్యయుత పద్ధతిలో చలో ప్రగతి భవన్‌కు పిలుపునిస్తే, సిఎం కేసీఆర్ ఎక్కడికక్కడ పోలీసులను పెట్టి అరెస్టు చేయడాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె లక్ష్మణ్ తీవ్రంగా విమర్శించారు. తెలంగాణ రాష్ట్రాన్ని నియంతృత్వ ప్రభుత్వం రాజ్యమేలుతోందని అన్నారు. ప్రజాసమస్యలపై నిలదీస్తే, టీఆర్‌ఎస్ సర్కార్ అణచివేతకు పాల్పడుతోందని ప్రశ్నించే వారే ఉండొద్దన్న రీతిలో ముఖ్యమంత్రి ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ నేతలను ఎక్కడికక్కడ కట్టడి చేయడం, అరెస్టులకు పాల్పడటం అప్రజాస్వామికమని పేర్కొన్నారు. ఉద్యమ పార్టీ నేతగా అధికారంలోకి వచ్చిన కేసీఆర్ నిరసనలు తెలపడం నేరమన్న ధోరణితో వ్యవహరించడం సిగ్గుచేటని విమర్శించారు. నాలుగేళ్ల టీఆర్‌ఎస్ పాలనలో పేదలు, మధ్యతరగతి వారు, వివిధ వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, రాష్ట్రంలో హిట్లర్‌ను మించిన పాలన కొనసాగిస్తున్న కేసీఆర్‌కు ప్రజలు తగిన గుణపాఠం చెప్పే సమయం ఆసన్నమైందని అన్నారు. నాలుగేళ్లయినా రాష్ట్రంలో ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయని అన్నారు. ఉట్టికెగరలేని వారు స్వర్గానికి ఎగిరినట్టు రాష్ట్రాన్ని చక్కదిద్దలేని కేసీఆర్ దేశాన్ని ఎలా ఉద్ధరిస్తారని డాక్టర్ లక్ష్మణ్ ప్రశ్నించారు. ఈశాన్య రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు చూసిన కేసీఆర్‌కు బీజేపీ ఫోబియా పట్టుకుందని, ఇక తమ అడ్రస్ గల్లంతయ్యే సమయం దగ్గరపడిందని జంకుతున్నారని అన్నారు. అందుకే నియంతలా వ్యవహరిస్తూ, పోలీసు దమనకాండతో ప్రశ్నించేవారి గొంతులు నొక్కుతున్నారని లక్ష్మణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరంకుశ పాలన కొనసాగిస్తున్న సిఎం కేసీఆర్‌కు ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని, ఆ రోజులు త్వరలో రాబోతున్నాయని అన్నారు. ముఖ్యమంత్రి మోదీకి క్షమాపణలు చేప్పే వరకూ ఈ పోరాటం ఆగదని, సిఎం ఎక్కడికి వెళ్లినా బీజేపీ కార్యకర్తలు అడ్డుకుంటారని లక్ష్మణ్ హెచ్చరించారు. కేసీఆర్ రాజ్యాంగంపై అవగాహన కూడా లేకుండా మాట్లాడుతున్నారని లక్ష్మణ్ విమర్శించారు. తెలంగాణ ప్రజలు టిఆర్‌ఎస్‌ను గెలిపించి నానా బాధలు పడుతున్నారని తమ తప్పులను కప్పిపుచ్చుకునేందుకు కేంద్రంపై నిందలు వేస్తూ, కేసీఆర్ కాలం వెళ్లబుచ్చుతున్నారని ఆరోపించారు.
వెనక్కి తగ్గిన రాష్ట్ర కమిటీ
సోమవారం నాడు సమావేశమైన కోర్ కమిటీ ఈ వ్యవహారాన్ని ఇంతటితో వదిలిపెట్టాలని నిర్ణయించింది. ప్రధానిపై వ్యాఖ్యలకు సంబంధించి ఆయన విజ్ఞతకే వదిలిపెట్టాలని నిర్ణయించింది. కేంద్ర నాయకత్వం ఆదేశాలతోనే పార్టీ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది.