తెలంగాణ

ప్రభుత్వ విజయాలపై కరదీపిక ఆవిష్కరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 5: గత నాలుగేళ్లలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం సాధించిన విజయాలను వివరిస్తూ ఆ పార్టీ నేత పీఎల్ శ్రీనివాస్ రచించిన ‘కరదీపిక’ను సోమవారం ముఖ్యమంత్రి కేసీఆర్ ఆవిష్కరించారు. రాష్ట్ర ఏర్పాటు అనంతరం ఆర్థిక, సాగునీటి, వ్యవసాయ రంగంల్లో రాష్ట్రం సాధించిన అభివృద్థి ఇందులో అద్బుతంగా పొందుపరిచారని అన్నారు. ప్రభుత్వ విజయాలు, సంక్షేమ పధకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు పార్టీ కార్యకర్తలు దీనిని ఉపయోగించుకోవాలని సూచించారు. ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టేందుకు సైతం ఈ పుస్తకం దోహదపడుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో రచయిత శ్రీనివాస్‌తో పాటు పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు.