తెలంగాణ

ఒక్క నిమిషం నిబంధనపై ఆందోళన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 5: ఇంత కాలం ప్రవేశపరీక్షలకే పరిమితమైన ‘ఒక్క నిమిషం’ నిబంధనను ఇక మీదట పదో తరగతి పరీక్షలకు సైతం అమలు చేయాలని ప్రభుత్వం యోచించడంపై విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయ సంఘాల నుండి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. రవాణా సదుపాయాలు లేని ఈ రాష్ట్రంలో వేర్వేరు ప్రాంతాల నుండి వచ్చి పరీక్షలు రాసేటపుడు విద్యార్థులకు ఒక్క నిమిషం నిబంధన శోచనీయమని టిపిటిఎఫ్ అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు బి కొండల రెడ్డి, మైస శ్రీనివాస్‌లు పేర్కొంటున్నారు. పదో తరగతి పరీక్షల్లో ఒక్కనిమిషం నిబంధన అమలు చేస్తామని ప్రభుత్వం చేసిన ప్రకటన విద్యార్ధులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోందని, ఎక్కడో ఏదో జరుగుతుందని భావించి సుమారు ఐదున్నర లక్షలకు పైగా పరీక్ష రాయబోయే విద్యార్థులను భయభ్రాంతులకు గురి చేయడం సరికాదని వారు చెబుతున్నారు. పరీక్ష కేంద్రాలి అన్నీ దాదాపుగా మండల కేంద్రాల్లో లేదా దానికి మూడు నాలుగు కిలోమీటర్ల దూరంలోనే ఉన్నాయని, ఈ ఏడాది పరీక్ష కేంద్రాలను ప్రభుత్వ పాఠశాలల్లోనే ఏర్పాటు చేయాలన్న ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఆదేశాల మేరకు అన్ని వసతులు ఉన్న స్కూళ్లలో ఏర్పాటు చేశారని, దాంతో ఒక్కో విద్యార్థి పరీక్ష రాయాలంటే కనీసం కిలోమీటరు నుండి పది కిలోమీటర్ల వరకూ ప్రయాణం చేయాల్సి వస్తోందని , ప్రయాణంలో అనుకోని అవాంతరాలు ఎదురై పరీక్ష కేంద్రానికి ఆలస్యంగా వెళ్తే నష్టపోవల్సి వస్తుందని అన్నారు. పరీక్షలంటే భయంతో , ఆందోళనకు విద్యార్థులను గురిచేస్తున్నారని, అక్రమాలకు పాల్పడితే జైలుకు పంపుతామని తీవ్రమైన హెచ్చరికలు చేస్తూ భయకంపితుల్ని చేస్తున్నారని , విద్యార్థి దశలో ప్రతి ఒక్కరూ ఎదుర్కొనే తొలి పబ్లిక్ పరీక్ష పదో తరగతి అవుతుందని, ఈ పరీక్షను ప్రశాంతంగా నిర్వహించాల్సింది పోయి, భయభ్రాంతులకు గురిచేయడం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు.
ఏ పరీక్షకైనా విద్యార్థులు గంట ముందు పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ టి పాపిరెడ్డి పేర్కొన్నారు. పరీక్ష కేంద్రాలకు ఆలస్యంగా చేరుకోవడం వల్ల ఆయా విద్యార్థులకే నష్టం కలుగుతుందని, గంట ముందే పరీక్ష కేంద్రాలను తెరచి ఉంచడం జరుగుతుందని, ముందే వచ్చి తమ సీట్లలో కూర్చుంటే ఎలాంటి ఉద్వేగం లేకుండానే పరీక్ష రాసే వీలుందని ఆయన పేర్కొన్నారు.
ప్రశాంతంగా ఇంటర్ పరీక్ష
సోమవారం ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఇంగ్లీషు పరీక్ష ప్రశాంతంగా జరిగినట్టు బోర్డు కార్యదర్శి డాక్టర్ అశోక్ తెలిపారు. 4,39,979 మంది రిజిస్టర్ చేసుకోగా, వారిలో 17,671 మంది గైర్హాజరయ్యారని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పెద్దపల్లిలో ఒకరిపైనా, కొత్తగూడెంలో ముగ్గురు, మెదక్ జిల్లాలో ఇద్దరు, సంగారెడ్డిలో ఒకరు, యాదాద్రి జిల్లాలో ఇద్దరిపై , మహబూబ్‌నగర్‌లో ఇద్దరు, వికారాబాద్‌లో ఒకరు, రంగారెడ్డిలో ఒకరిపై మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు చేశామని అన్నారు. పరీక్షకు సెట్ బి ప్రశ్నాపత్రం ఎంపిక చేసినట్టు తెలిపారు.