తెలంగాణ

ఆఖరి బడ్జెట్‌లో ఆడంబరాలేనా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 8: ఆంధ్రప్రదేశ్‌లో బడ్జెట్‌లో లెక్కలన్నీ అవాస్తవాలేనని, నాలుగేళ్లలో చంద్రబాబు ప్రభుత్వం సాధించిందేమీ లేదని వైకాపా ఎమ్మెల్యే, పిఏసి చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి విమర్శించారు. ఆయన ఇక్కడ విలేఖర్లతో మాట్లాడుతూ 2018-19 సంవత్సరానికి రాష్ట్రానికి సంబంధించి సొంత ప న్ను రూ.65,603 కోట్లు, గత ఏడాది రూ.52,715 కోట్లని, ఐదు వేల రెవెన్యూ రాబడి ఎక్కువ చూపుతున్నారని చెప్పారు. రెవెన్యూ లోటుపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వడం లేదన్నారు. రాష్ట్రానికి సిఐఐ సదస్సుల ద్వారా రూ.16 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, లక్షల్లో ఉద్యోగాలు వచ్చాయని చెప్పడం ఏమిటన్నారు. రాష్ట్ర జనాభా కంటే ఉద్యోగాలు ఎక్కువ ఉన్నా, ఆశ్చర్యపోనక్కర్లేదన్నారు. రాష్ట్రంలో అప్పులు విపరీతంగా పెంచుతున్నారని చెప్పారు. 60 సంవత్సరాల ఉమ్మడి ఏపిలో రూ.90 వేల కోట్ల అప్పు ఉంటే బాబు కేవలం నాలుగేళ్లలో రూ.2లక్షల కోట్లకు ప ఐగా ఇప్పటికే అప్పులు చేశారన్నారు. రైతు రుణమాఫీని చంద్రబాబు విస్మరించారన్నారు. రాష్ట్ర బడ్జెట్‌లో కేటాయింపులు, రెవెన్యూలో స్పష్టత లేదన్నారు. పోలవరం ప్రాజెక్టు సంగతేమిటని ప్రశ్నించారు. ఈ బడ్జెట్ ఆడంబరాల మయమన్నారు. రెండు లక్షల కోట్ల రూపాయల అప్పుకు సాలీనా రూ.15వేల కోట్ల వడ్డీని చెల్లిస్తున్నారని చెప్పారు.