తెలంగాణ

పిజి మెడికల్ విథ్యార్థులకు ఏడాది ‘పని’ తొలగింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 8: వైద్య విద్యలో పోస్ట్‌గ్రాడ్యుయేషన్ (పిజి) పూర్తి చేసిన విద్యార్థులు ఏడాదిపాటు ప్రభుత్వ దవాఖానాల్లో పనిచేయాలన్న నిబంధనను తొలగిస్తున్నామని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ప్రకటించారు. ఈ మేరకు అధికారికంగా గురువారం ప్రకటన జారీ చేస్తూ, పిజి వైద్య విద్యార్థులు చాలా కాలంగా చేస్తున్న డిమాండ్‌ను పరిశీలించి ఈ నిర్ణయం తీసుకున్నామని వివరించారు. తాను తీసుకున్న నిర్ణయాన్ని చట్టంగా రూపొందించేందుకు త్వరలో జరిగే చట్టసభల్లో ఒక బిల్లు ప్రవేశపెడతామన్నారు. పిజి పూర్తి చేసిన తర్వాత ఏడాది పాటు ప్రభుత్వ దవాఖానాల్లో పని (సర్వీస్) చేయాలని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పాలనలో చట్టం చేశారు. ఈ చట్టం దాదాపు దశాబ్ద కాలంపాటు అమల్లో ఉంది. పిజి పూర్తిచేసిన విద్యార్థులు ఏడాది పాటు సర్కారు దవాఖానాల్లో పనిచేస్తేనే వారి పేర్లను ప్రభుత్వం రిజిస్టర్ చేసేది. ఇక నుండి ఈ షరతు ఉండదు. అంటే పిజి పూర్తి చేసిన వారు ప్రభుత్వ దవాఖానాల్లో ఏడాది పాటు పనిచేయాల్సిన అవసరం ఉండదు. ఈ సంవత్సరం పిజి పూర్తిచేసిన వారు కూడా ఏడాది పని చేయాల్సిన అవసరం లేకుండా తమ పేర్లను రిజిస్టర్ చేసుకునేందుకు అనుమతి ఇస్తున్నట్టు కెసిఆర్ స్పష్టం చేశారు. పిజి విద్యార్థులకు ఏడాది పనిభారం తొలగించాలని వైద్య విద్యార్థులు చాలా కాలంగా పోరాటం చేస్తూనే ఉన్నారు. పిజి వైద్య విద్యార్థుల డిమాండ్‌ను ముఖ్యమంత్రి సానుభూతితో పరిశీలించి, వారి కోరికను మన్నించారు. గతంలో ఎంబిబిఎస్ పూర్తి చేసిన వారు కూడా ఏడాది పాటు గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ దవాఖానాల్లో పనిచేయాలని ‘షరతు’ ఉండేది. ఈ షరతును ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం తొలగించింది. పిజి వైద్య విద్యార్థులకోసం రూపొందించిన షరతును ఇప్పుడు తొలగించారు.
పిజి వైద్య విద్యార్థులు ప్రభుత్వ దవాఖానాల్లో పనిచేయాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి కెసిఆర్ తీసుకున్న నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వ డాక్టర్ల సంఘం అధ్యక్షుడు డాక్టర్ ప్రవీణ్ స్వాగతించారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేస్తూ, సిఎం నిర్ణయం వల్ల సర్కారుపై ఆర్థిక భారం కూడా తగ్గుతుందన్నారు. ప్రభుత్వ దవాఖానాల్లో పోస్టులను భర్తీ చేయడం వల్ల పిజి వైద్య విద్యార్థుల సేవలు అవసరం ఉండదన్నారు. సిఎం నిర్ణయం సముచితమైందని ప్రవీణ్ ప్రశసించారు.