తెలంగాణ

రాష్ట్ర రైతు సమన్వయ సమితి చైర్మన్‌గా గుత్తా సుఖేంథర్‌రెడ్డి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 8: తెలంగాణ రాష్ట్ర సమన్వయ సమితి డైరెక్టర్ మరియు చైర్మన్‌గా పార్లమెంట్ సభ్యుడు గుత్తా సుఖేందర్‌రెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. గుత్తా సుఖేందర్‌రెడ్డి నియామకం విషయాన్ని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు గత నెల 25 న జరిగిన రైతు సమన్వయ సమితుల సమావేశంలో అనధికారికంగా ప్రకటించిన విషయం గమనార్హం. త్వరలోనే అధికారికంగా ఉత్తర్వులు జారీ అవుతాయని కూడా సిఎం అదే రోజు ప్రకటించారు. గుత్తా సుఖేందర్‌రెడ్డిని డైరెక్టర్ అండ్ చైర్మన్‌గా నియమించిన ఈ సమితికి నలుగురు ఐఏఎస్ అధికారులను డైరెక్టర్లుగా నియమించారు. వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శి సి. పార్థసారథి, వ్యవసాయ కమిషనర్ డాక్టర్ ఎం. జగన్‌మోహన్, ఉద్యాన డైరెక్టర్ ఎల్. వెంకటరామిరెడ్డి, వ్యవసాయ మార్కెటింగ్ డైరెక్టర్ జి. లక్ష్మీబాయిలను డైరెక్టర్లుగా నియమించారు. ఈ ఉత్తర్వులు వెంటనే అమల్లోకి వస్తాయి.
రాష్ట్ర రైతు సమన్వయ సమితిని నాన్‌ప్రాఫిట్ ఆర్గనైజేషన్‌గా గుర్తిస్తూ, 2013 కంపెనీల చట్టం కింద కొత్త కార్పోరేషన్‌గా రిజిస్టర్ చేశారు. కొత్త కార్పోరేషన్‌కు కార్పోరేట్ ఐడింటిఫికేషన్ నెంబర్ (యుఓ 1100 టిజి 2018 ఎన్‌పిఎల్ 122755) కూడా వచ్చింది.
ఈ కార్పోరేషన్‌కు నియమావళిని, టర్మ్స్ అండ్ కండీషన్స్‌ను త్వరలో ప్రకటిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శి పేరుతో ఈ ఉత్తర్వులు జారీ అయ్యాయి.