తెలంగాణ

ఉపాధి నిధులతో 155 మహిళా భవనాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 8: కరీంగర్, వరంగల్ (అర్బన్), జగిత్యాల, పెద్దపల్లి, వనపర్తి, నాగర్‌కర్నూలు జిల్లాల్లో 155 మహిళా భవనాలు నిర్మించేందుకు ప్రభుత్వం అనుమతించింది. ఈ మేరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి వికాస్‌రాజ్ పేరుతో గురువారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. 2017-18 సంవత్సరానికి సంబంధించిన జాతీయ ఉపాధిహామీ పథకం కింద 155 మహిళా భవనాలను నిర్మించేందుకు అనుమతి ఇస్తున్నామని తెలిపారు. ఒక్కో మహిళా భవనానికి 10 లక్షలు ఖర్చు చేసేందుకు అనుమతించారు. పంచాయతీరాజ్ శాఖ ఇంజనీర్-ఇన్-చీఫ్ ఈ మేరకు అవరమైన చర్యలు తీసుకోవాలని జీఓలో ఆదేశించారు.