తెలంగాణ

అకృత్యాలను ప్రతిఘటించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సీలేరు, మార్చి 8: మహిళలపై జరుగుతున్న అకృత్యాలను సంఘటితంగా ప్రతిఘటించాలని మావోయిస్టు పార్టీ ఆంధ్రా, ఒడిశా ప్రత్యేక జోనల్ కమిటీ పిలుపునిచ్చింది. గురువారం ఏవోబీలోని దట్టమైన అటవీ ప్రాంతంలో మావోయిస్టులు మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈవేడుకలకు సరిహద్దు ప్రాంతాల నుంచి భారీ ఎత్తున మహిళలు హాజరయ్యారు. ఈ సందర్భంగా మావోయిస్టు ముఖ్య నాయకులు మాట్లాడుతూ కమ్యూనిస్టు యోధుడు లెనిన్ పోరాటాల ఫలితంగా 1907 నుంచి ప్రతీ ఏటా మార్చి 8న మహిళా దినోత్సవ వేడుక నిర్వహిస్తున్నారన్నారు. నాటి నుంచి నేటి వరకు మహిళల హక్కుల కోసం పోరాటం జరుగుతున్నా ఫలితం లేదన్నారు. 70 ఏళ్ల నుంచి అనేక ప్రజాస్వామ్య పోరాటాలు మహిళలు జరుపుతున్నప్పటికీ ప్రభుత్వాలు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. దీనిపై చట్టాలు కఠినతరం చేయడం లేదన్నారు. కుటుంబాల్లోనే బాల్యం నుంచీ మహిళలపై అణిచివేత జరుగుతోందన్నారు. ఈ ఆచారాన్ని ప్రభుత్వాలు పోషిస్తున్నాయని, దీని ఫలితంగా మహిళలు దయనీయ స్థితిలో అణిచివేతకు గురవుతున్నారన్నారు. యువతలో బలహీనత రెచ్చగొట్టి మహిళలను అందాల బొమ్మలుగా మార్కెట్‌లో సరకులుగా చూపిస్తున్నారన్నారు. ఈవ్ టీజింగ్ వ్యతిరేకించినందున యాసిడ్ దాడులకు పాల్పడుతున్నారని , ప్రకృతి సౌందర్యం కలిగిన ప్రాంతాల్లో టూరిజం, అభివృద్ధి , పారిశ్రామిక అభివృద్ధి చేస్తున్నారని, దీనిలో భాగంగా విశాఖలో అరకు, లంబసింగి అభివృద్ధికి ప్రభుత్వం పథకాలు చేస్తోందని ఆరోపించారు.