తెలంగాణ

రిజర్వేషన్ల అధికారం రాష్ట్రాలకు ఇవ్వాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 8: కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే రిజర్వేషన్లను ఖరారు చేసే అధికారాన్ని రాజ్యాంగ సవరణతో ఇవ్వవచ్చని తెలంగాణ బీసీ కమిషన్ చైర్మన్ ప్రొఫెసర్ బి ఎస్ రాములు పేర్కొన్నారు. జనాభా లెక్కల్లో ఎస్సీ, ఎస్టీ జనాభా మాదిరి మరిన్ని వివరాలను సేకరించి ఉంటే ఈ సమస్య ఉత్పన్నం అయ్యేది కాదని అన్నారు. ఎవరి జనాభా ఎంతో, ఎవరు ముందుకు సాగారో, ఎలాంటి ప్రణాళికలు చేపట్టాలో తెలుస్తుందని పేర్కొన్నారు. కేంద్రానికి కావల్సింది చిత్తశుద్ధి మాత్రమేనని, అది లేనందునే జనాభా లెక్కలను తీసే అధికారం రాష్ట్రాలకు ఇవ్వాలని అందుకు 1948 చట్టాన్ని, రాజ్యాంగాన్ని సవరించాలని అన్నారు. కేంద్రం కూడా రాష్ట్రాల యంత్రాం గం ద్వారానే జనాభా లెక్కలు, ఓటర్ల లిస్టులు తయారుచేస్తుందని అన్నారు. కేంద్రానికి ప్రత్యేకంగా యంత్రాంగం అంటూ క్షేత్ర స్థాయిలో ఉండే అవకాశం లేదని, అందువల్ల రాష్ట్రాలకే జనాభా లెక్కలు తీసే అధికారం, జీఎస్టీని తొలగించి రాష్ట్రాలకు పూర్తి అధికారం ఇవ్వాలని అన్నారు. ఇన్‌కమ్‌టాక్స్ విధించి దానిని పొందే అధికారం , రిజర్వేషన్లు పెంచుకునే అధికారం, ఆయా ప్రత్యేక స్కీమ్‌లు, బడ్జెట్‌లు అమలుజరిపే అధికారం కూడా రాష్ట్రాలకే ఉండాలని అభిప్రాయపడ్డారు. దేశవ్యాప్తంగా నేటికీ కుల వివక్ష, మత వివక్ష, ప్రాంతీయ వివక్ష కొనసాగుతునే ఉందని, రిజర్వేషన్లు 50 శాతం మించకూడదని చెబుతూనే సుప్రీంకోర్టు సరైన డేటా ఉన్నపుడు అంతకుమించి పెంచుకోకూడదని చెప్పిందని, అయినా ఇటీవల తెలంగాణ బీసీ కమిషన్ ఇచ్చిన రిపోర్టును తెలంగాణ చట్టసభలు ఆమోదించి కేంద్రానికి పంపితే రిజర్వేషన్లు 50 శాతం మించకూడదని సుప్రీంకోర్టు తీర్పు చెబుతోందని కేంద్రం దానిని వెనక్కు పంపిందని, ఇది సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధమని పేర్కొన్నారు. స్పష్టమైన సుప్రీంకోర్టు తీర్పు ఉండగా, కేంద్రం అబద్దాలు చెప్పడం శోఛనీయమని పేర్కొన్నారు. 31 బి ఆర్టికల్ ద్వారా 15.4, 16.4 ద్వారా 9వ షెడ్యూలులో చేర్చడం ద్వారా తెలంగాణ బీసీ కమిషన్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సిఫార్సులు తీర్మానాల మేరకు బీసీ రిజర్వేషన్లు పెంచడాన్ని యథతథంగా ఆమోదించడం కనీస కర్తవ్యమని అన్నారు. 1950 జనవరి 26 నుండి ఉదాత్తమైన భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిందని, స్వేచ్ఛ సమానత్వం, అందరికీ సమాన అవకాశాలు, ఆ అవకాశాలను వెనుకబడిన వారు అందుకునే ప్రత్యేక ఏర్పాట్లు కల్పించే ఆర్టికల్ 15.4, 16.4 , 31బి ఆర్టికల్ చేర్చబడ్డాయని అవి పూర్తిస్థాయిలో ఇంకా ఆచరణలోకే రాలేదని వ్యాఖ్యానించారు.

చిత్రాలు..శాసనసభ బడ్జెట్ సమావేశాల సందర్భంగా బందోబస్తు ఏర్పాట్లపై డీజీపీ మహేందర్‌రెడ్డి, పోలీసు ఉన్నతాధికారులతో చర్చించిన స్పీకర్ మదుసూధనాచారి, శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్, శాసనసభ కార్యదర్శి వేదాంతచారి తదితరులు