తెలంగాణ

ఆ స్టేషన్లలో మొత్తం మహిళా ఉద్యోగులే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 8: రైల్వే స్టేషన్లలో మహిళలకు అవసరమైన కొన్ని ముఖ్యమైన విషయాల్లో సత్వర చర్యలు తీసుకున్నట్లు ద.మ.రైల్వే జిఎం వినోద్‌కుమార్ యాదవ్ తెలిపారు. పలు రైల్వే స్టేషన్‌లలో శానిటరీ నాప్‌కిన్ వెండింగ్ యంత్రాలు, బేబీ ఫీడిం గ్ సెంటర్లను ఏర్పాటు చేసినట్లు వివరించారు. గురువారం నాడిక్కడ బేగంపేట రైల్వేస్టేషన్‌ను పూర్తి స్ధాయి మహిళా ఉద్యోగులు ఉన్న స్టేషన్‌గా గుర్తించిన సందర్భంగా మహిళా ఉద్యోగులతో కలిసి ఆయ న మాట్లాడారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు ఇలా స్టేషన్లో అంతా మహిళా ఉద్యోగులే ఉండడం రెండూ కలి సి వచ్చిందని కొనియాడారు. బేగంపేటతో పాటు విద్యానగర్, చంద్రగిరి, న్యూ గుం టూరు రైల్వే స్టేషన్లు కూడా పూర్తి స్ధాయిలో మహిళా ఉద్యోగులు ఉన్న రైల్వే స్టేషన్లుగా గుర్తించబడ్డాయని ఆయన విలేకర్లకు వివరించారు. సికింద్రాబాద్, నాందేడ్, కాచిగూడ, ఔరంగాబాద్ రైల్వే స్టేషన్లలో బేబీ ఫీడింగ్ కేంద్రాలను ప్రారంభించినట్లు వెల్లడించారు. మహిళల భద్రతను దృష్టిలో ఉంచుకుని మహిళా టిక్కెట్ తనిఖీ అధికారులతో కలిసి ఆర్‌పిఎఫ్‌తో నిర్భయ స్క్వాడ్‌లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు.