తెలంగాణ

సీఎం క్యాంప్ కార్యాలయం ముట్టడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 8: తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గిరిజన మిని గురుకుల కాంట్రాక్ట్ ఉద్యోగులు గురువారం సిఎం క్యాంప్ కార్యాలయ ముట్టడికి యత్నించారు. ముందే సమాచారం అందుకున్న పోలీసులు భారీ సంఖ్యలో మోహరించారు. ముట్టడికి రావడంతో వారందరిని అరెస్టు చేసి గోషామహల్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. మహిళా దినోత్సవం రోజు మహిళలు సిఎంను కలిసేందుకు వస్తే అడ్డుకోవడం పట్ల వారంతా ఆగ్రహం వ్యక్తం చేశారు. ముందుకు దూసుకెళ్లిన వారిని నిలువరించే ప్రయత్నంలో కొందరు కిందపడిపోయారు. పోలీసులు, ఆందోళన కారుల మధ్య గొడవలో పలువురికి గాయాలయ్యాయి. తమ గోడు వినిపించేందుకు వస్తే నిర్ధాక్షణ్యంగా అరెస్టు చేశారని వారు ఆందోళన వ్యక్తం చేశారు. తమకు జీతాలు పెంచి ఉద్యోగ భద్రత కల్పించాలని వారు డిమాండ్ చేశారు. డిప్యూటేషన్ విధానాన్ని రద్దు చేసి అర్హత కలిగిన వారిని వార్డెన్లుగా నియమించాలని కూడా డిమాండ్ చేశారు. తొలుత గిరిజన మంత్రి చందూలాల్ మినిస్టర్స్ క్వార్టర్స్‌లోని ఆయన నివాసాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించారు. అక్క డ మంత్రి లేకపోవడం, పోలీసులు అడ్డుకున్నారు. అక్కడ కూడా పోలీసులతో వాగ్వా దం జరిగింది. అరెస్టు అయిన వారిలో యూనియన్ గౌరవ అధ్యక్షుడు మావిడి వెంకట్‌రెడ్డి, నల్గొండ జిల్లా అధ్యక్షుడు రామ్‌కోటి, పలువురు జిల్లా కార్యదర్శులు, 30 మందికిపైగా ఉద్యోగులు ఉన్నారు.

చిత్రం..ఆందోళనకారులను తరలిస్తున్న పోలీసులు