తెలంగాణ

పొత్తు లేకున్నా హామీలు నెరవేరుస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 8: తెలుగుదేశం పార్టీతో పొత్తు ఉన్నా లేకున్నా ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన హామీలను బీజేపీ నెరవేరుస్తుందని బిజెపి జాతీయ నాయకుడు ప్రొఫెసర్ ఎస్వీ శేషగిరిరావు పేర్కొన్నారు. గురువారం నాడు ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ తెరాస రిజర్వేషన్ల అంశం రాష్ట్రానికి ఉండాలని డిమాండ్ చేస్తోందని, రిజర్వేషన్లు అనేది చాలా సున్నితమైన అంశమని అన్నారు. అనేక అంశాలతో ముడిపడి ఉందని, రాష్ట్రాలకు ఇవ్వడమనేది ఆషామాషీ కాదని , దీనివల్ల వైషమ్యాలు పెరుగుతాయని, కొట్లాటలు జరుగుతాయని , రాష్ట్ర ప్రభుత్వాలు మారినపుడల్లా రిజర్వేషన్లు మారుతాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రాజ్యాంగం రాసేటపుడు బీజేపీ, జనసంఘ్‌లు పుట్టలేదని, అందులో తమ సభ్యులు లేరని, మత ప్రాతిపదికపై రిజర్వేషన్లు ఏ విధంగానూ సరికాదని తొలి నుండి తాము చెబుతున్నామని అన్నారు. రాష్ట్రాలకు రిజర్వేషన్లను నిర్ణయించే అధికారం ఇవ్వడం సరికాదని, మతపరమైన రిజర్వేషన్లు ఇవ్వడం సరికాదని పేర్కొన్నారు. జలవనరుల గురించి కేసీఆర్ మాట్లాడుతున్నారని, 70వేల టిఎంసిలు వృధాఅవుతున్నాయని కాకి లెక్కలు చెప్పారని, దేశంలో నీటి సమస్య తీరాలంటే నీరు ఉన్న ప్రాంతం నుండి లేని చోటుకు నీటిని తరలించాలని , తాము ఈ అంశంపై వాజపేయి ప్రభుత్వ హయాంలోనే అడుగులు వేశామని అన్నారు.
నీటిని వాడుకోవడంలో వివాదాలు దేశంలో రాష్ట్రాలకే పరిమితం కాలేదని, సరిహద్దు దేశాలతో కూడా వివాదాలు ఉన్నాయని అన్నారు. నరేంద్రమోదీ ప్రభుత్వం నదీ జలాల అనుసంథానంపై కార్యాచరణ ప్రారంభమైందని, ముఖ్యమంత్రి ఈ విషయం తెలుసుకుని మాట్లాడాలని అన్నారు. గత నాలుగేళ్లుగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఏం జరుగుతుందో విశే్లషించుకోవాలని, ప్రతి సందర్భంలోనూ కేసీఆర్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. సీతారాం ఏచూరి, జయరాం రమేష్‌లు కూడా మాట్లాడుతున్నారని వారంతా ముందు ప్రస్తుత పరిస్థితులను విశే్లషించుకోవాలని అన్నారు. పాత్రికేయుల సమావేశంలో ప్రధానకార్యదర్శి డాక్టర్ జి మనోహర్‌రెడ్డి, మీడియా కన్వీనర్ సుధాకర్ శర్మ తదితరులు పాల్గొన్నారు.