తెలంగాణ

తక్కువ ఖర్చుతో వైద్యపరికరాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 8: విద్య, వైద్య రంగాల్లో ప్రజలకు ఎంతో ఉపయోగపడే పరికరాలను తక్కువ ఖర్చుతో రూపొందించేందుకు, అభివృద్ధి చేసేందుకు శాస్తవ్రేత్తలు మరింత కృషి చేయాలని భారత ప్రభుత్వ ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వయిజర్ ఆర్ చిదంబరం పేర్కొన్నారు. హైదరాబాద్‌లో గురువారం నాడు సెంటర్ ఫర్ మెటీరియల్స్ ఫర్ ఎలక్ట్రానిక్ టెక్నాలజీ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఇన్ అడ్వాన్స్‌డ్ సెమీ కండక్టర్సు మెటీరియల్స్ అండ్ డివైసెస్ 28వ వార్షిక స్థాపక దినోత్సవాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అప్లయిడ్ రీసెర్చికు బేసిక్ రీసెర్చికు ముడిపెట్టడానికి ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. అలాగే ఎలక్ట్రానిక్ టెక్నాలజీలో మెటీరియల్స్ రీసెర్చికు ఎంతో ప్రాధాన్యం ఉందని చెప్పారు. సిలికాన్ కార్బైడ్, గాలియం నైట్రేట్ వంటి పదార్థాల వినియోగంతో తక్కువ ఖర్చుతో ఉపకరణాలను తయారుచేయవచ్చని అన్నారు. వివిధ శాస్ర్తియ పరికరాల్లో సెన్సార్‌లు, కండక్టర్‌లు వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో ఆధునిక వినియోగం ఉండే సెమికండక్టర్ల నెట్‌వర్కు అభివృద్ధిని సిఎంఇటి చేపట్టాలని అన్నారు. బలమైన ఇ వేస్టు పరిజ్ఞానాల విధానాలను రూపొందించాలని, 2020 నాటికి దేశంలో వాడిన వాహనాల నుండి 180 టన్నుల అల్యూమినియం ఉత్పత్తి అవుతుందని, దీనిని రీ మెల్ట్ చేయడం ద్వారా సహజంగా అయ్యే ఇంధన వినియోగంలో 7 శాతం మాత్రమే ఖర్చు అవుతుందని అన్నారు.
రక్షణ మంత్రి సలహాదారు సతీష్‌రెడ్డి మాట్లాడుతూ దేశ భవిష్యత్ అవసరాలకు పనికొచ్చే పరిజ్ఞానాలను గుర్తించాలని శాస్తవ్రేత్తలకు సూచించారు. ఆ దిశగా లక్ష్యాలను నిర్దేశించుకుని వాటి సాధన కోసం పరిజ్ఞానాలను రూపొందించాలని , అది జరిగినపుడే దేశీయ అవసరాలకు పరిజ్ఞానాలను ఉపకరణాలను భారత్ స్వతంత్రంగా సమకూర్చుకోగలుగుతుందని చెప్పారు.
ఈ సమావేశంలో సిఎంఇటి డైరెక్టర్ జనరల్ డాక్టర్ ఎన్ ఆర్ మునిరత్నం, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ డైరెక్టర్ డాక్టర్ ఎస్ చంద్రశేఖర్, సిఎంఇటి డైరెక్టర్ డాక్టర్ ఆర్ రతీశ్, ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ సెమి కండక్టర్స్ మెటీరియల్స్ అండ్ డివైసెస్ కన్వీనర్ డాక్టర్ డి ఎస్ ప్రసాద్ వివిధ సంస్థల శాస్తవ్రేత్తలు కూడా పాల్గొన్నారు.

చిత్రం..సెంటర్ ఫర్ మెటీరియల్స్ ఫర్ ఎలక్ట్రానిక్ సాంకేతిక పరిజ్ఞాన సదస్సులో పాల్గొన్న చిదంబరం తదితరులు