తెలంగాణ

హైదరాబాద్‌లో ప్రపంచమేటి మహిళలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 8: క్రీడలు, వ్యాపార రంగాల్లో అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్న మహిళామణులు హైదరాబాద్‌లో ఉన్నారని ఐటి శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. హైదరాబాద్‌కు చెందిన యువతులు క్రీడల్లో అంతర్జాతీయస్థాయిలో రాణిస్తున్నారన్నారు.
సైనా నెహ్వాల్, సానియా మీర్జా, మిథాలిరాజ్, అరుణారెడ్డి తామేంటో ప్రపంచానికి చాటారన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని జూబ్లీహిల్స్‌లో అంబేద్కర్ యూనివర్సిటీ ప్రాంగణంలో వీ-హబ్‌ను ( ఉమెన్ ఎంట్రీప్రెన్యూర్ హబ్) గురువారం మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ ప్రసంగిస్తూ ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడానికి రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టిందన్నారు. వీ-హబ్ ను రూ. 15 కోట్ల వ్యయం ఏర్పాటు చేసామన్నారు. వీ-హబ్ మహిళా పారిశ్రామికవేత్తలు ఉత్పత్తి చేసిన వస్తువులకు తెలంగాణ ప్రభుత్వమే తొలి కొనుగోలుదారుగా వ్యవహరిస్తుందన్నారు.
విస్తృతమైన పట్టిష్టమైన వాణిజ్య వేదిక నిర్మించుకునేందుకు ప్రభుత్వపరంగా సహకారం అందిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా వీ-హబ్‌లో కల్పన ఏర్పాటు చేసిన పెళ్లిపూల జడ వ్యాపారం ఆదర్శనీయమని మంత్రి కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఐటిశాఖ ముఖ్య కార్యదర్శి జయేష్‌రంజన్, సైంటిస్ట్ టెస్సీ థామస్‌తో పాటు ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తలు పలువురు పాల్గొన్నారు.

చిత్రం..ప్రపంచ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని వీ-హబ్‌ను
ప్రారంభిస్తున్న పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్