తెలంగాణ

కాంగ్రెస్ పాలనలోనే మహిళలకు పెద్దపీట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, మార్చి 8: కేసీఆర్ కేబినెట్‌లో మహిళలకు ప్రాతినిధ్యం లేకపోవడం సిగ్గుచేటని టీ పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ధ్వజమెత్తారు. స్వాతంత్య్ర భారత్‌లో మహిళా మంత్రి లేని ఏకైక కేబినెట్ తెలంగాణ మాత్రమేనని విమర్శించారు. 2కోట్ల మంది మహిళల్లో ఒక్కరూ కూడా అర్హులు లేరా అని ప్రశ్నించారు. గురువారం ఎల్‌ఎండిలోని ఎస్సారెస్పీ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ ముందుగా మహిళలకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఉక్కు మహిళ సోనియా దృఢ సంకల్పంతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరిగిందని చెప్పారు. తెలంగాణ ఇవ్వడం తప్పన్నట్టుగా ప్రధాని మోదీ మాట్లాడితే, టీఆర్‌ఎస్ ఎంపీలు, కేసీఆర్ నోరు మెదపలేదని దుయ్యబట్టారు. జీఎస్టీ, రాష్టప్రతి, ఉప రాష్టప్రతి ఎన్నికల్లో మోదీకి మద్దతు పలికాడని గుర్తు చేశారు. గత కాంగ్రెస్ పాలనలో మహిళా సాధికారితకు పెద్దపీట వేసామని గుర్తు చేశారు. డిసెంబర్‌లోనే ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని, తమ సర్వే ప్రకారం తామే అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. మహిళా సంఘాలను టీఆర్‌ఎస్ సర్కార్ నీరుగార్చిందని, అధికారంలోకి వస్తే మహిళా సంఘాలకు పూర్వవైభవం తెస్తామని అన్నారు. రూ.లక్ష చొప్పున 6లక్షల సంఘాలకు గ్రాంట్ ఇస్తామని, రూ.10లక్షల చొప్పున రుణాలు ఇప్పించి వడ్డీ చెల్లిస్తామని తెలిపారు. అభయహస్తం పెన్షన్‌ను వెయ్యికి పెంచుతామని, పార్లమెంట్‌లో మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతిస్తామని ప్రకటించారు. రిజర్వేషన్ల పేరుతో ముస్లిం, గిరిజనులను గత నాలుగేళ్లుగా మోసం చేస్తున్న కేసీఆర్‌కు ఓట్లు అడిగే హక్కు లేదని అన్నారు. ముస్లింలకు 12శాతం, గిరిజనుల రిజర్వేషన్ 12శాతం ఇస్తామని మొదటి ఫైల్ మొదటి సంతకం అంటూ ప్రగల్బాలు పలికాడని ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా వివోఏలు 18వేల మంది ఉన్నారని, వారికి 3వేల నుండి 10వేల రూపాయల వేతనం ఇచ్చేవిధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నట్ట్లు తెలిపారు.