తెలంగాణ

యాదాద్రి నిర్మాణాల్లో మార్పులు..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, మార్చి 8: తెలంగాణ సీఎం కేసీఆర్ ఆశయం మేరకు యాదాద్రి లక్ష్మినరసింహస్వామి దేవస్థానం అద్భుత దివ్యక్షేత్రంగా నిర్మించేందుకు సాగుతున్న పనుల్లో తలెత్తిన వాస్తు దోషాల సవరణ దిశగా వైటిడిఏ తన నిర్మాణ డిజైన్లను మార్చుకుంటూ పనులను ముందుకు దూకిస్తోంది. పూర్తిగా నల్లసరం కృష్ణ శిలలు, శిల్పాలతో నిర్మితమవుతున్న యాదాద్రి ప్రధాన దేవాలయం అద్భుత శిల్పకళతో కూడిన శిల్పాలు, ప్రాకారాల తయారీ, మండపాలు, రాజగోపురాల నిర్మాణాలతో కూడుకుని ఉండటంతో నిర్మాణంలో జాప్యం అనివార్యమవుతోంది. శిల్పాలను చెక్కడం, వాటిని కొండపైకి తరలించి అవసరమైన చోట అమర్చడం వంటి పనులు నిర్మాణాన్ని ఆలస్యం చేస్తున్నా ఆధునిక యంత్రాల వినియోగంతో జాప్యాన్ని అధిగమించే కసరత్తు చేస్తున్నారు. సప్త గోపురాలు, మాఢ వీధులు, మహాప్రాకారాలుతో ప్రధానాలయాన్ని ఆగస్టుకల్లా పూర్తి చేసే దిశగా వైటిడిఏ వివిధ శాఖలను సమన్వయం చేస్తూ పనుల్లో వేగం పెంచింది. అయితే నిర్మాణ నమూనాలో భాగంగా గర్భాలయం ముఖ ద్వారం ఎదురుగా మెట్లను నిర్మిస్తుండటంపై వాస్తు అభ్యంతరాలు తలెత్తడంతో స్వయంగా త్రిదండి చినజీయర్‌స్వామి ఇటీవల నిర్మాణ పనులను పరిశీలించి వైటిడిఏ అధికారులతో, స్తపతి, ఆర్కిటెక్ట్‌లతో సమావేశమై నిర్మాణాల్లో మార్పుల ఆవశ్యకతను వారికి వివరించారు. జీయర్ సూచనలతో నూతన డిజైన్‌ను రూపొందించి జీయర్ స్వామి అనుమతులతో నిర్మాణాల్లో మార్పులు, చేర్పులు చేస్తున్నారు. ఆగమశాస్త్రాన్ని అనుసరించి వైష్ణవ ఆలయ నిర్మాణంలో తీసుకోవాల్సిన వాస్తు పద్ధతులతో నిర్మాణం సాగాలని జీయర్ స్వామి నిర్దేశించారు. దీంతో వాస్తు విరుద్ధంగా గర్భాలయం ముఖ మండపం ఎదుట పడమటి వైపున నిర్మిస్తున్న 60మెట్ల దారిని తొలగించాలని జీయర్ స్వామి సూచించడంతో వెంటనే వాటి తొలగింపు చేపట్టనున్నారు. స్వయంభూ ఎదురుగా ఇతర కట్టడాలు చేపట్టరాదని జీయర్ సూచించారు. ప్రధానాలయం ముఖ మండపాన్ని గత నమునాలో అర్ధ ముఖ మండపంగా ప్రతిపాదించగా ఇప్పుడు దానిని పెరుగనున్న భక్తుల రద్దీ మేరకు మహాముఖ మండపంగా విశాలంగా నిర్మించనున్నారు. అలాగే గర్భాలయంపై ఉన్న పాత దివ్యవిమాన గోపురాన్ని అలాగే ఉంచి దానికి ముందు నూతన విమాన గోపురాన్ని నిర్మించనున్నారు. పాత విమానగోపురంలో శయన నరసింహుడి శిల్పాన్ని ఏర్పాటు చేయాలని స్తపత్తులు, శిల్పులకు జీయర్ స్వామి సూచనలిచ్చారు. అలాగే ప్రధాన ఆలయం పై భాగంలో స్వయంభూ రూపాలను ప్రస్ఫూటింపచేసేలా పంచనారసింహుల రూపాల శిల్పాలను సైతం ఏర్పాటు చేయాలని జీయర్ సూచించారు. అటు గర్భగుడి ప్రాంగణాన్ని యథాతథంగా ఉంచుతూనే ఐదు అడుగులు ముందుకు ప్రవేశద్వారాన్ని వెడల్పు చేయాలని, స్వయంభూల ఎదురుగా ముఖ మండపంలో నిలువు అద్దం ఏర్పాటు చేయాలన్న సూచనల మేరకు వైటిడిఏ నిర్మాణాలు చేపట్టనుంది. రక్షణ గోడ నిర్మాణం మే నెల నాటికి పూర్తి కానుంది. ప్రధాన ఆలయంలో నిర్మాణాలతో పాటు నవగిరుల అభివృద్ధి, రోడ్లు, మంచినీరు, విద్యుత్ వసతుల కల్పన, ఉద్యానవనాలు, కాటేజీల నిర్మాణ పనులను సైతం సమాంతరంగా కొనసాగించాలని సీఎం కేసీఆర్ సూచించినప్పటికీ ఆయా శాఖల పనుల్లో ఆలస్యం కనిపిస్తోంది.