తెలంగాణ

కోనేరులో మునిగి... ముగ్గురు సోదరుల మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, మార్చి 8: మహబూబ్‌నగర్ జిల్లా అడ్డాకుల మండలం కందూరు శ్రీ రామలింగేశ్వర స్వామి క్షేతంలోని కోనేరులో మునిగి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అన్నదమ్ములు మృతి చెందిన సంఘటన గురువారం చోటు చేసుకుంది. రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మహబూబ్‌నగర్ పట్టణం ఏనుగొండలో నివాసం ఉంటున్న ఓ కుటుంబం స్వామివారిని దర్శించుకునేందుకు బయలుదేరారు. అయితే స్వామిని దర్శించుకునే ముందు కోనేరులో పుణ్యస్నానం చేసేందుకు ఎనుగొండ గ్రామానికి చెందిన ఆంజనేయులు ముందుకు కోనేరులోకి దిగారు. ఆయన ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోతుండటాన్ని చూసిన ఆయన రెండవ అన్న పవన్‌కుమార్ కోనేరులోకి వెళ్లి తమ్ముడిని రక్షించేందకు యత్నించారు.
అంతలోనే వారిద్దరు సైతం నీటిలో మునిగిపోతున్నారని గ్రహించిన పెద్దన్న రవికుమార్ సైతం కోనేరులోకి దిగి ఇద్దరి తమ్ముళ్లను రక్షించేందుకు యత్నించారు. అయితే ముగ్గురికీ ఈత రాని కారణంగా కోనేరులో మునిగిపోయారు. రవికుమార్(29) పవన్‌కుమార్(26) ఆంజనేయులు(19)లు కోనేరులో నీట మునిగి మృతి చెంది విషయాన్ని అక్కడున్న వారు చూసి వారి కంగారు పడి కోనేరులో నుండి పరుగులు తీశారు.
వెంటనే కొందరు ఈత వచ్చిన వారు కోనేరులో వెతకగా ముగ్గురి మృతదేహాలను గుర్తించి వారిని బయటకు తీశారు. ఒకే కుటుంబానికి చెందిన వారు ముగ్గురు అన్నదమ్ములు నీట మునిగి చనిపోవడంతో వారి కుటుంబ సభ్యులతో పాటు బ్రహ్మోత్సవాలకు వచ్చిన భక్తులు సైతం బోరున విలపించారు. పోస్టుమార్టం నిమి త్తం అడ్డాకుల పోలీసులు జిల్లా ఆసుపత్రికి మృతదేహలను తరలించారు. కాగా మహబూబ్‌నగర్ పట్టణానికి చెందిన ముగ్గురు అన్నదమ్ములు మృతి చెందడంతో పట్టణ ప్రజలు జిల్లా ఆసుపత్రి దగ్గరకు చేరుకుని కుటుంబ సభ్యులను ఓదార్చారు.

చిత్రం..మృతి చెందిన రవికుమార్ (29) పవన్‌కుమార్ (26) ఆంజనేయులు (19)