తెలంగాణ

వరంగల్ ‘నిట్’లో స్ప్రింగ్ స్ప్రీ’వేడుకలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్,మార్చి 8: వరంగల్ నిట్ కళాశాలకు స్ప్రింగ్ స్ప్రీ శోభ సంతరించుకుంది. మూడు రోజుల పాటు జరిగే స్ప్రింగ్ స్ప్రీ వేడుకలను గురువారం రాత్రి వరంగల్ పోలీసు నగర కమిషనర్ జి.సుధీర్‌బాబు లాంఛనంగా ప్రారంభించారు. ఈసందర్భంగా సీపీ మాట్లాడుతూ భిన్నత్వంలో ఏకత్వంలా కొనసాగుతున్న నిట్ కళాశాల ప్రతిష్టను మరింత పెంచేలా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించుకోవాలని కోరారు. ఈకార్యక్రమంలో నిట్ డైరెక్టర్ ఎన్‌వి రమణారావు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ స్ప్రింగ్ స్ప్రీ వేడుకల్లో నిట్ కళాశాలకు చెందిన 8వేల మంది విద్యార్ధులతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న దాదాపు 100 ఇంజనీరింగ్ కళాశాలల నుండి 5వేల మందికి పైగా విద్యార్ధులు పాల్గొంటున్నారు. మొత్తం 50కిపైగా ఈవెంట్లు, పెద్ద ఎత్తున సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. శుక్రవారం నుండి మొదలు కానున్న ఈ వేడుకల కోసం ఇప్పటికే నిట్ క్యాంపస్‌కు విద్యార్థులు చేరుకోవడంతో సందడిమొదలైంది.

చిత్రం..వేడుకలను లాంఛనంగా ప్రారంభించిన సీపీ సుధీర్‌బాబు
నిట్‌లో విద్యార్థుల సందడి