తెలంగాణ

బాసరలో వెయ్యిమందికి అక్షరాభ్యాసం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాసర, మార్చి 8: బాసర అమ్మవారి సన్నిధిలో గురువారం భక్తుల సందడి నెలకొంది. గురువారం పర్వదినాన్ని పురస్కరించుకుని అమ్మవారిచెంత అక్షరాభ్యాస పూజ లు జరిపించేందుకు భక్తులు, చిన్నారులు ఒక్కరోజు ముందుగానే తరలివచ్చారు. ఉదయం నుండి 11 గం టల వరకు ముహూర్తబలం ఉండటంతో ఆలయంలోని అక్షరాభ్యాస మండపాలు భక్తులు, చిన్నారులతో కిటకిటలాడాయి. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు తమ చిన్నారులకు ఆలయంలోని అక్షరాభ్యాస మండపంలో ఘనంగా అక్షరాభ్యాస పూజలు జరిపించి ఆలయంలోని అమ్మవార్లను దర్శించుకుని మొక్కు లు తీర్చుకున్నారు. భక్తుల రద్దీకి అనుగుణంగా ఆలయ అధికారులు ఏర్పాట్లుచేశారు. ఆర్జిత సేవలు, ప్రసాదాల విక్రయాల ద్వారా ఆలయానికి రూ.8 లక్షల 30 వేల ఆదా యం సమకూరినట్టు ఆలయ అధికారులు తెలిపారు.

చిత్రం..ఆలయంలో అక్షరాభ్యాసం పూజల కోసం వేచివున్న భక్తులు