తెలంగాణ

మిలియన్ మార్చ్ స్ఫూర్తి సభకు అనుమతి నిరాకరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 8: ఈ నెల 10వ తేదీన ట్యాంక్ బండ్‌పై మిలియన్ మార్చ్ స్ఫూర్తి సభ నిర్వహణకు అనుమతించాలన్న సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి చేసిన అభ్యర్ధనను నగర పోలీసులు తిరస్కరించారు. తెలంగాణ రాష్ట్ర సాధన సందర్భంగా నిర్వహించిన మిలియన్ మార్చ్ కార్యక్రమాన్ని స్పూర్తిగా తీసుకుని ‘ఆట, పాట, మాట’ అనే కార్యక్రమాన్ని నిర్వహించేందుకు అనుమతించాలని కోరుతూ తెలంగాణ జెఏసి తరఫున చాడ ఈ నెల 2న నగర సెంట్రల్ జోన్ డిసిపికి దరఖాస్తు చేశారు. నగర నడిబొడ్డున ఈ కార్యక్రమం చేపట్టడం వల్ల ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం, ప్రజలకు ఇబ్బందులు కలుగుతుందని భావించి అనుమతి నిరాకరిస్తున్నట్లు డిసిపి డి.జోయల్ డవిస్ అధికారికంగా గురువారం ప్రకటించారు. ఈ కార్యక్రమానికి ఎంతమంది హాజరవుతారనేది కూడా నిర్వాహకులు సరైన సమాచారం ఇవ్వలేదని పేర్కొన్నారు. ప్రస్తుతం పదవ తరగతి, ఇంటర్ పరీక్షలు జరుగుతున్నందున కార్యక్రమానికి అనుమతిస్తే ట్రాఫిక్ జామ్ కావడం, రవాణా సదుపాయం లేక విద్యార్థులు ఇబ్బంది పడతారని తిరస్కరించినట్లు తెలిపారు. అంతేకాకుండా గతంలో జరిగిన మిలియన్ మార్చ్‌లో సంఘ విద్రోహశక్తులు చొరబడి పెద్ద ఎత్తున విధ్వంసం సృష్టించిన అనుభవం దృష్ట్యా అనుమతి నిరాకరిస్తున్నట్లు డిసిపి పేర్కొన్నారు. ఆ సందర్భంగా చాలా మందికి గాయాలు కావడం, ప్రజలకు తీవ్ర అసౌకర్యం కలిగిందని, ఆప్పట్లో చాలా మందిపై క్రిమినల్ కేసులు నమోదైనట్లు గుర్తు చేశారు. ఈ అంశాలన్నీ దృష్టిలో ఉంచుకుని అనుమతి నిరాకరిస్తున్నట్లు తెలిపారు.