తెలంగాణ

ఇది మహిళా వ్యతిరేక ప్రభుత్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 8: కాంగ్రెస్, టీఆర్‌ఎస్ రెండు పార్టీలూ పాపాల పుట్ట అని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె లక్ష్మణ్ విమర్శించారు. కేసీఆర్ రాజకీయ జీవి తం ప్రారంభమైందే కాంగ్రెస్ పార్టీ నుం డని ఆయన విమర్శించారు. రాజకీయ పార్టీల్లో మహిళలకు మూడో వంతు అవకాశాలు కల్పిస్తూ, వారిని రాజకీయంగా అభివృద్ధి చెందేలా చేస్తున్న ఏకైక పార్టీ బీజేపీ అని ఆయన స్పష్టం చేశారు. అం తర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మహిళా దినోత్సవ కార్యక్రమంలో మాట్లాడారు. కేంద్రంలో రక్షణ మంత్రిగా నిర్మలా సీతారామన్, విదేశాంగ మంత్రిగా సుస్మా స్వరాజ్, లోక్‌సభ స్పీకర్‌గా సుమిత్రా మహాజన్, హర్ సిమ్రత్ కౌర్ బాదల్ వంటి పలువురు మహిళలకు కేబినెట్‌లో అవకాశం కల్పించిన ఘనత మోదీ ప్రభుత్వానిదేనని అన్నారు. మహిళలు ఏ పని తలపెట్టినా, నిజాయితీగా, నిబ్బరంగా, నైపుణ్యంగా పూర్తి చేస్తారని అన్నారు. రాష్ట్రంలో టిఆర్‌ఎస్ మహిళా వ్యతిరేక ప్రభుత్వమని ఆరోపించారు.
ఒక్క మహిళకు కూడా మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేదని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి మహిళల పట్ల ఎంత గౌరవం, చిత్తశుద్ధి ఉందో తెలుస్తోందని అన్నారు. మహిళలపై ముఖ్యమంత్రికి ఇంత చిన్నచూపు ఎందుకని ఆయన ప్రశ్నించారు. కనీసం తెలంగాణలో మహిళా కమిషన్‌లో కూడా తెలంగాణ రాష్ట్రానికి చెందిన మహిళలకు చోటు దక్కలేదని అన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ నాలుగేళ్లలో మోదీ ప్రభుత్వం మహిళా సంక్షేమానికి పెద్దపీట వేసిందని, నిరుపేద అమ్మాయిలు టాయిలెట్లు లేవన్న నెపం తో మధ్యలోనే బడి మానేస్తుండటంతో ప్రధాని మోదీ వారి కోసం పాఠశాలల్లో టాయిలెట్లను నిర్మించి, అమ్మాయిలు చదువు మానేయకుండా చర్యలు తీసుకున్నారని అన్నారు. 70 ఏళ్ల భారతావనిలో దేశంలో మహిళలు పడుతున్న ఇబ్బందులు చూసి, ప్రధాని నరేంద్రమోదీ స్వచ్ఛ భారత్ కార్యక్రమంలోభాగంగా షీ టాయిలెట్లు కూడా ఏర్పాటు చేశారని అన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన నాటికి దేశంలో 40 శాతం జనాభాకు సైతం మరుగుదొడ్లు లేవని, మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంటింటికీ మరుగుదొడ్లు నిర్మించేందుకు చర్యలు చేపట్టి మహిళల ఆత్మగౌరవాన్ని ఇనుమడింపచేశారని పేర్కొన్నారు. మహిళా సంక్షేమానికి సుకన్య సమృద్ధి యోజన, భేటీ బచావో, భేటీ పడావో వంటి కార్యక్రమాలను అమలుచేస్తున్నారని, ఉజ్వల పథకంలో భాగంగా దేశంలోని 8కోట్ల మంది నిరుపేదలకు ఉచిత గ్యాస్ కనెక్షన్లు ఇస్తున్నారని అన్నారు.
మహిళలంటే కేసీఆర్ సర్కార్‌కు చాలా చిన్నచూపని బీజేపీ మహిళా మోర్చ అధ్యక్షురాలు ఆకుల విజయ పేర్కొన్నారు. మహిళలకు తగిన ప్రాధాన్యం ఇవ్వలేదని ఆమె ఆరోపించారు. ఎలాంటి బాధ్యతలు అప్పగించినా, మహిళలు ఓపికగా, సహనంతో అందరికంటే నైపుణ్యంగా నెరవేరుస్తారనే విషయాన్ని గులాబి పార్టీ గుర్తుంచుకోవాలని ఆకుల విజయ అన్నారు.