తెలంగాణ

రోడ్డు భద్రతకు ప్రతిజ్ఞచేసిన పది వేల మంది మహిళలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 8: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రోడ్డు భద్రతకు ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని దేశంలోని 12 నగరాల్లో నిర్వహించినట్లు హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా సంస్ధ వైస్ ప్రెసిడెంట్ యద్వీందర్ సింగ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పదివేల మంది మహిళలు పాల్గొన్నారని చెప్పారు. ప్రతి సంవత్సరం భారతదేశంలో 18 మిలియన్ల నూతన ద్విచక్రవాహనాలు రోడ్డుపైకి వస్తున్నాయి. మహిళలు తమ ప్రయాణాన్ని సురక్షితం చేసేందుకు హోండా సంస్థ హెల్మెట్ ధారణ ఆవశ్యకతను నిర్వహించినట్లు చెప్పారు. డ్రీమ్ రైడింగ్‌లో భాగంగా హైదరాబాద్‌కు చెందిన 700 మంది మహిళలకు కేవలం 4 గంటల్లో ఇండిపెండెంట్ రైడర్లుగా శిక్షణ ఇచ్చామన్నారు. సురక్షిత బ్రేకింగ్, సవారీ చేసేటప్పుడు సరైన స్థానంలో కూర్చోవడం, సరైన గేర్ ధరించాల్సిన ఆవశ్యకత, సెంట్రల్ స్టాండ్‌ను సరిగా వేయడం, తీయడం లాంటి అంశాలపై మహిళలకు అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పరు.