తెలంగాణ

నేడు కరీంనగర్‌లో ‘హిందూ శంఖారావం’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, మార్చి 10: హిందూ సమాజాన్ని ఐక్యం చేసే లక్ష్యంగా ఆదివారం సాయంత్రం కరీంనగర్ జిల్లా కేంద్రంలోని పూలే (సర్కస్) మైదానంలో తలపెట్టిన ‘హిందూ శంఖారావం’ సదస్సుకు అంతా సిద్ధమైంది. బీజేపీ నేత బండి సంజయ్‌కుమార్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ హిందూ శంఖారావం సభకు శ్రీపీఠం పీఠాధిపతి స్వామి పరిపూర్ణానందస్వామి హాజరుకానుండగా, భారీగా హిందువులు తరలివచ్చేవిధంగా వారం రోజులుగా నాయకులు, కార్యకర్తలు ఇంటింటా తిరుగుతూ విస్తృత ప్రచారం నిర్వహించారు. జిల్లా కేంద్రంతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో విస్తృత ప్రచారం చేపట్టారు. భారీగా తరలివస్తారని ఆశిస్తున్న నిర్వాహకులు అదేస్థాయిలో వేదిక, ఇతర ఏర్పాట్లు చేశారు.
ఈ సందర్భంగా మత మార్పిడులు, మతపరమైన రిజర్వేషన్లు, గోహత్యలు, ట్రిపుల్ తలాఖ్, హిందూ ధర్మాన్ని కించపర్చటం తదితర అంశాలపై హిందూ సమాజాన్ని చైతన్యపర్చనున్నారు.
కాగా, హిందూ శంఖారావం నిర్వహించే సర్కస్ మైదానంలో శనివారం సాయంత్రం నిర్వాహకులు, బీజేపీ నేత బండి సంజయ్‌కుమార్ ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా సంజయ్ మాట్లాడుతూ గతకొద్దిరోజులుగా కొందరు హిందూ సమాజాన్ని చీల్చే ప్రయత్నం చేస్తున్నారని, హిందువుల్లో ఐక్యత లేదని తప్పుడు ప్రచారం చేస్తున్నారని, వీటిని తిప్పికొట్టడానికే ఈ హిందూ శంఖారావం నిర్వహిస్తున్నామని, ఈ శంఖారావం వారికి కనువిప్పు కలిగేలా ఉంటుందని తెలిపారు. హిందువులంతా పెద్ద సంఖ్యలో ఈ శంఖారావానికి తరలివచ్చి హిందువుల ఐక్యతను చాటాలని సంజయ్ పిలుపునిచ్చారు. ఆయన వెంట నాయకులు బేతి మహేందర్‌రెడ్డి, ప్రవీణ్‌రావులతోపాటు పలువురు ఉన్నారు.