తెలంగాణ

రిజర్వేషన్లపై తప్పుడు సమాచారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 10: రిజర్వేషన్ల విషయంలో తప్పుడు సమాచారంతో ప్రజలను రాష్ట్ర ప్రభుత్వం వంచిస్తోందని బీజేపీ అధికార ప్రతినిధి రావుల శ్రీ్ధర్‌రెడ్డి ఆరోపించారు. శనివారం నాడు ఆయన పార్టీ కార్యాలయంలో పాత్రికేయులతో మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ మోడల్ దేశవ్యాప్తం కావాలని అంటున్నారని, మాట తప్పడం, ఇచ్చిన మాట అమలుచేయకపోవడమే తెలంగాణ మోడలా? ధర్నా చౌక్ రద్దు చేయడమే తెలగాణ మోడలా అంటూ నిలదీశారు. దళితుడ్ని ముఖ్యమంత్రిని చేస్తానని మాట తప్పడం, దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తామని, ఇవ్వకుండా మోసం చేయడం, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇవ్వకుండా పేదలను మోసం చేయడం, సెక్రటేరియట్‌కు రాకుండా ఫామ్ హౌస్ నుండి పరిపాలన చేయడం, కుటుంబ పాలన నిర్వహించడం, ఇదేనా తెలంగాణ మోడల్ అని నిలదీశారు. తిట్లు శాపనార్ధాలను తెలంగాణ భాషగా మార్చేశారని, ఇపుడు మాత తప్పడం కూడా తెలంగాణ మోడల్‌గా మార్చేస్తున్నారని ఆరోపించారు.
అందుకే ప్రభుత్వ విధానాలు, కేసీఆర్ పరిపాలన పట్ల వ్యక్తమవుతున్న ప్రజావ్యతిరేకతను దారి మళ్లించేందుకు థర్టు ఫ్రంట్ అని మాట్లాడుతున్నారని, ముఖ్యమంత్రి నాటకం ఆడుతుంటే టీఆర్‌ఎస్ నాయకులు రియాల్టీ షోలలో పాల్గొనే నటుల కంటే కూడా అద్భుతంగా నటిస్తూ, అపుడే కేసీఆర్ ప్రధాని అయినట్టు కలలు కంటున్నారని ఆరోపించారు. నాలుగేళ్లపాటు డీమానిటైజేషన్ మొదలుకుని, జీఎస్‌టి వరకూ అన్ని అంశాలను ప్రశంసించి, ఇటువంటి అద్భుతమైన ప్రధానిని నా 40 ఏళ్ల రాజకీయ జీవితంలో చూడలేదని మాట్లాడిన కేసీఆర్.. సీటు కిందకు నీళ్లు వస్తాయని తెలియగానే రాత్రికి రాత్రి ప్లేట్ మార్చి ఫెడరల్ స్ఫూర్తికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని అన్నారు.